క్రీడాభిమానులతో మ్యాచ్‌ను అడ్డుకుంటాం.. యువజన సంఘాల హెచ్చరిక

by Disha Web Desk 5 |
క్రీడాభిమానులతో మ్యాచ్‌ను అడ్డుకుంటాం.. యువజన సంఘాల హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: అరగంటలో 36 వేల టికెట్లు అమ్ముడు అవుతాయా?, క్రికెట్ అభిమానులతో కలిసి సన్ రైజర్స్ మ్యాచ్ ను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ సత్యప్రసాద్ అన్నారు. ఏప్రిల్ 25 తేదీన ఉప్పల్ స్టేడియంలో జరగబోయే సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉందని, దీనికి సంబందించిన టికెట్లు సన్ రైజర్స్ యాజమాన్యం, హెచ్‌సీఏ వాళ్లు పేటీఎంలో అమ్మకానికి పెట్టారని తెలిపారు. దీనికి సంబందించిన టికెట్లు అరగంటలోనే దాదాపు 36 వేల టికెట్లు అమ్ముడుపోయాయని హెచ్‌సీఏ ప్రకటించిందని, ఇది చాలా విడ్డూరంగా ఉందని, ఇలాంటి అక్రమాలపై గతంలోనే విభేదించామని అన్నారు.

టికెట్ల విక్రయాలపై నివేధిక విడుదల చేయాలని కోరుతూ.. స్టేడియం వద్ద యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించామని తెలిపారు. అక్రమాలపై హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు. అలాగే మీరు తప్పు చేయనట్లయితే నివేదిక ఇవ్వడానికి ఏమైంది అని ప్రశ్నించారు. అంతేగాక రేపు జరగబోయే మ్యాచ్ కోసం 4,700 టికెట్లు హెచ్‌సీఏ వద్దకు వచ్చాయని సమాచారం అందిందని, ఈ టికెట్లు ఎవరికి ఇచ్చారో వివరాలు బహిర్గతం చేయాలని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ ను డిమాండ్ చేశారు. తక్షణమే దీనిపై స్పందించకుంటే క్రీడాభిమానులతో కలిసి ఏప్రిల్ 25 న జగరబోయే మ్యాచ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Next Story

Most Viewed