సమరశీల పోరాటాలు నిర్వహించాలి : కూనంనేని సాంబశివ రావు

by Disha Web Desk 1 |
సమరశీల పోరాటాలు నిర్వహించాలి : కూనంనేని సాంబశివ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు పిలుపునిచ్చారు. బుధవారం మఖ్డూమ్ భవన్‌లో సీపీఐ రంగారెడ్డి జిల్లా సమితి సమావేశంలో పాల్గొన్న కూనంనేని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపితం చేయవలసిన తక్షణ అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా ఉద్యమాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలలో తన పునాదిని నిరంతరం విస్తరించుకోవచ్చని అన్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేందుకు సీపీఐ సంకల్పాన్ని రెట్టింపు చేయడం మరియు బలమైన ప్రజా పోరాటాలను ఆవిష్కరించడం ద్వారానే ముందుకు సాగగలుగుతామని పేర్కొన్నారు.

పార్టీ సంస్థాగత సామర్థ్యాలను విస్తృతంగా అభివృద్ధి చేసుకుంటూ జిల్లాల స్థాయిలో పార్టీ స్వతంత్ర బలాన్ని పెద్దఎత్తున పెంచుకోవాలని కోరారు. వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, వ్యవసాయేతర విభాగాల్లోని గ్రామీణ కార్మికులు, చేతి వృత్తులవారు, అసంఘటిత రంగాల్లో కాంట్రాక్ట్ కార్మికులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కరానికి ఉద్యమాలు నిర్మించాలన్నారు. ఆర్థిక దోపిడీ, సామాజిక అణచివేత సమస్యలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఎదుర్కుంటున్న సమస్యలపై శక్తివంతమైన ప్రజా పోరాటాలను ఆవిష్కరించడానికి ప్రజలతో పార్టీ శ్రేణులు సంబంధాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని అలాగే పెను ప్రమాదంలోఉన్న భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం రక్షించుకోవడానికి ప్రజలని చైతన్యపరిచి ఉద్యమించాలని కూనంనేని సాంబశివ రావు కోరారు.



Next Story