మారిపోనున్న వరంగల్‌ రైల్వే స్టేషన్‌.. నూతన హంగులు దిద్దనున్న కేంద్రం

by Aamani |
మారిపోనున్న వరంగల్‌ రైల్వే స్టేషన్‌.. నూతన హంగులు దిద్దనున్న కేంద్రం
X

దిశ, వరంగల్‌ టౌన్ : వరంగల్‌ రైల్వే స్టేషన్‌ మరింతగా మారిపోనుంది. ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అమృత్‌ మిషన్‌లో భాగంగా దేశంలో 554 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు బీజేపీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీ రైల్వే స్టేషన్ల నవీకరణ పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్‌ మిషన్‌లో వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు కూడా చోటు దక్కింది.

రూ.25.41కోట్లతో వివిధ వసతులు కల్పించనున్నారు. 12 మీటర్ల వెడెల్పుతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీ, మూడు ఎస్కలేటర్లు, మూడు లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. సోమవారం ప్రధాని మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో వీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బండ ప్రకాష్‌, బస్వరాజు సారయ్య, పసునూరి దయాకర్‌ నగర మేయర్‌ గుండు సుధారాణి, పలు డివిజన్లో కార్పొరేటర్లు, రైల్వేశాఖ అధికారులు, బిజెపి నాయకులు హాజరయ్యారు. అమృత్‌ మిషన్‌లో వరంగల్‌కు చోటుదక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed