ఉత్సాహంగా వరంగల్ ప్రెస్ క్లబ్ క్రీడలు

by Mahesh |
ఉత్సాహంగా వరంగల్ ప్రెస్ క్లబ్ క్రీడలు
X

దిశ, హన్మకొండ: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్-2024 లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడల్లో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మూడో రోజు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో క్రికెట్ పోటీలు జరిగాయి. ఉదయం సాక్షి డెస్క్ టీం వర్సెస్ యంగ్ ఎలక్ట్రానిక్ టీం మధ్య జరిగిన పోటీలను సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. నమస్తే తెలంగాణ టీం వర్సెస్ కెమెరామెన్స్ టీం మధ్య జరిగిన పోటీలను బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ప్రారంభించారు. ఇందులో యంగ్ ఎలక్ట్రానిక్ టీం, కెమెరామెన్స్ జట్లు విజయం సాధించాయి. మధ్యాహ్నం.. లగాన్ టీం వర్సెస్ హన్మకొండ కింగ్స్ టీం మధ్య జరిగిన పోటీలను ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐ నాగబాబు ప్రారంభించారు. క్రీడాకారులను అతిథులకు పరిచయం చేసిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బెల్లాలకు సదయ్యలు వారికి క్లబ్ తరఫున జ్ఞాపికలు అందించారు.

మళ్లీ దుమ్మురేపిన హన్మకొండ కింగ్స్

లగాన్ టీంతో జరిగిన మ్యాచ్ లో హన్మకొండ కింగ్స్ మళ్లీ సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్ తో లగాన్ టీంను మట్టి కరిపించింది. హ‌న్మకొండ కింగ్స్ జట్టు త‌రుపున ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన దిశ వ‌రంగ‌ల్ బ్యూరో అరెల్లి కిర‌ణ్ గౌడ్ 30 ప‌రుగులు చేసి బౌలింగ్‌లో 3ఓవ‌ర్లు వేసి 10 ప‌రుగులిచ్చి మూడు వికెట్లు తీసాడు. పొదుపుగా బౌలింగ్ చేయ‌డంతో పాటు ల‌గాన్ టీంలోని ముగ్గురు ప్రధాన ఆట‌గాళ్లను క్లీన్‌బౌల్డ్ చేయ‌డంతో మ్యాచ్ మొత్తం మ‌లుపు తిరిగింది. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన హ‌న్మకొండ కింగ్స్ జ‌ట్టులో మ‌రో ఓపెన‌ర్ సుధాక‌ర్ 30 బంతుల్లో 46 ర‌న్స్ చేసి మ‌రోసారి స‌త్తా చాటాడు. ప్రాణ‌హిత జ‌ట్టుపై 40 బంతుల్లో 111 ర‌న్స్ కొట్టిన విష‌యం తెలిసిందే. రెండో మ్యాచ్‌లోనూ సుధాక‌ర్ త‌న ఫాంను కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. హన్మకొండ కింగ్స్ ఉత్తమ ఆటతీరును ప్రదర్శించి సెమీ ఫైనల్ కు చేరుకుంది.

Advertisement

Next Story