టూరిస్టులు వస్తుంటారు..పోతుంటారు..నేను మీ అందరివాడిని : మంత్రి ఎర్రబెల్లి

by Disha Web Desk 23 |
టూరిస్టులు వస్తుంటారు..పోతుంటారు..నేను మీ అందరివాడిని : మంత్రి ఎర్రబెల్లి
X

దిశ,దేవరుప్పుల: టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు నేను మీ అందరివాడినని ఆపద అంటే వెన్నంటే ఉండేవాడినని 60 ఏళ్లు పాలించి ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తుందో ప్రజలు తెలుసుకొని ఆలోచించి ఓటు వేయాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరుప్పుల మండలంలోని రామరాజు పల్లి నిర్మల సింగరాజు పల్లి గ్రామాల్లో పర్యటించారు.మంత్రి ఎర్రబెల్లికి పార్టీ శ్రేణులు మహిళలు డప్పు చప్పులు కోలాట ఆటలతో బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు.సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని మన పిల్లలు మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ప్రతి ఒక్కరూ ఆలోచించి అభివృద్ధి సంక్షేమ అందించే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఆశీర్వదించాలని అన్నారు.

నేను గత 15 సంవత్సరాలుగా మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ మీ మధ్య ఉన్నానని కరోన కష్ట సమయంలో సొంత డబ్బులతో ఆంధ్ర నుండి ఆనందయ్య మందు నిత్యవసరకులు అందించి మీ ప్రాణాలను కాపాడిన వ్యక్తినని గుర్తు చేశారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాత రోజే వస్తాయని తెలియజేశారు.వారు పాలించే రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమం అందించని అసమర్ధ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించారు.సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని ఉచిత కరెంటు ఉచిత సాగు త్రాగునీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు రైతు బీమా బీసీ బందు కెసిఆర్ కిట్టు తదితర సంక్షేమ పథకాలు అందించిన సీఎం కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని సూచించారు.

రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో 200 మందికి ఉద్యోగ ఇచ్చే ఏర్పాట్లు ,ప్రతి ఇంటికి లబ్ధి చేకూరాలే ప్రణాళిక చేపట్టినట్లు తెలిపారు.కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలకు డబ్బులకు ఆశపడి మోసపోవద్దని అన్నారు.ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలని నన్ను ఆశీర్వదిస్తున్న ఆదరిస్తున్న మీ అందరిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాదని మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి దీవించాలని కోరారు.అనంతరం రామరాజుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి ఎర్రబెల్లి సమీక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మండల సమన్వయకర్త పళ్ళ సుందర్ రాంరెడ్డి జడ్పిటిసి పల్లా భార్గవి వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ పిఎసిఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి ఎంపీటీసీ మేడ కళ్యాణి వెంకటేష్ సర్పంచులు బండి స్నేహ నరసింహ మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి గోపాల్ దాస్ మల్లేష్ మేకపోతుల నరసింహ మేడ విద్యాసాగర్ కొత్త జలంధర్ రెడ్డి కుతాడి నరసింహులు బీఆర్ఎస్ పార్టీ గ్రామ మండల ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed