పంటనష్టం దురదృష్టకరం.. రైతులు అధైర్యపడొద్దు : మంత్రులు

by Web Desk |
పంటనష్టం దురదృష్టకరం.. రైతులు అధైర్యపడొద్దు : మంత్రులు
X

దిశ, పరకాల: అకాల వడగండ్ల వర్షాల మూలంగా దెబ్బతిన్న పంట పొలాలను మంగళవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం పరిశీలించిందింది. పరకాల, నడికూడ మండలాలకు చెందిన నాగారం, మల్లక్కపేట, నర్సక్కపల్లి, నడికూడ గ్రామాల్లో సందర్శించి పంటనష్టపోయిన రైతులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల మండలం నాగారం గ్రామంలో అల్లె రాజయ్య, మాచబోయిన బాబులకు చెందిన మిర్చి పంటను పరిశీలించే క్రమంలో రైతులు మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కాళ్ల మీదపడి బోరున విలపించడం హృదయాలను కలచివేసిందన్నారు. పంట నష్టంతో బతుకుమీద ఆశలు కోల్పోయామని రైతులు మంత్రులకు విన్నవించారు. దీనికి మంత్రులు నిరంజన్ రెడ్డి, దయాకర్ రావులు స్పందిస్తూ.. ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఓదార్చారు. అనంతరం మీడియాతో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షాల మూలంగా రైతుల పంటలు దెబ్బతినడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకునే విధంగా ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

రైతులు అధైర్యపడొద్దు : మంత్రి ఎర్రబెల్లి

అకాల వర్షాలు మిగిల్చిన నష్టం బాధను కలిగించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు రైతులు ఎవరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


Next Story

Most Viewed