దిశ ఎఫెక్ట్.. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్

by Dishafeatures2 |
దిశ ఎఫెక్ట్.. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్
X

దిశ, భీమదేవరపల్లి: ఈ నెల 1న 'విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్' శీర్షికతో ప్రచురితమైన దిశ వార్తా కథనానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు. విద్యార్థులను చితకబాదిన సదరు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేస్తూ విద్యా శాఖ అధికారులు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నెల (నవంబర్) 30న షూ, యూనిఫాం వేసుకురాలేదంటూ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రణయ్ కుమార్ 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులను వాతలు పడేలా కర్రతో దండించాడు. నొప్పిని భరించలేక కొట్టొద్దని విద్యార్థులు ఎంత బ్రతిమిలాడినా సదరు ప్రిన్సిపాల్ వినలేదు. ఇంకా గట్టిగా కొట్టడంతో విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. గమనించిన తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే ఈ విషయం మీడియాకు తెలిసి ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా.. వాళ్లలో సత్ప్రవర్తన కొరవడిందని, అందుకే దండించానని ప్రిన్సిపాల్ చెప్పడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే విషయమై పలు పత్రికల్లో వార్త కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 3న జిల్లా విద్యాశాఖ, మాడల్ స్కూల్ ఎక్స్ ఆఫీషియో ప్రాజెక్ట్ డైరెక్టర్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రిన్స్ పాల్ పై సస్పెన్షన్ వేటు పడింది.


Next Story

Most Viewed