ఐపాస్, హెచ్ఐ సర్వీసుల మంజూరుకు చర్యలు చేపట్టండి..

by Disha Web Desk 11 |
ఐపాస్, హెచ్ఐ సర్వీసుల మంజూరుకు చర్యలు చేపట్టండి..
X

దిశ, హనుమకొండ టౌన్: ఐపాస్, హెచ్ఐ సర్వీసుల మంజూరు త్వరితగతిన అయ్యేటట్లు సత్వర చర్యలు చేపట్టాలని సీఎండీ అన్నమనేని గోపాల్ రావు అన్నారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, విద్యుత్ భవన్, నక్కలగుట్ట, హన్మకొండ, కార్పొరేట్ కార్యాలయంలో మంగళవారం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు, పి. గణపతి, పి. సంధ్యారాణి, వి. తిరుపతి రెడ్డిలు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల ఎస్ఈలతో, డీఈలతో, ఎస్ఏఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమనేని గోపాల్ రావు మాట్లాడుతూ రూ. 50,000 పైబడినా రాని బకాయిలను వసూళ్లు చేయాలన్నారు.

నాయిబ్రాహ్మణ, దోభీఘాట్, లాండ్రీ సర్వీసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఏటీ అండ్ సీ నష్టాలు తగ్గించుకోవాలన్నారు. మీటర్ రీడింగ్ లను తనిఖీలు చేయాలన్నారు. అంతరాయాలను తగ్గించుకోవాలన్నారు. లైన్ల మెయింటెనెన్స్ చేయాలన్నారు. విధిగా హెడ్ క్వార్టర్స్ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హెచ్ఆర్డీ, పీ అండ్ ఎంఎం బి. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ ఐపీసీ అండ్ ఆర్ఏసీ పి.గణపతి, డైరెక్టర్ కమర్షియల్ పి.సంధ్యారాణి, ఇంచార్జ్ డైరెక్టర్ ఫైనాన్స్ వి. తిరుపతిరెడ్డి, సీజీఎంలు కిషన్, అశోక్ కుమార్, సదర్లాల్, బీకంసింగ్ లు, జీఎంలు, ఎస్ఈ వరంగల్ మధుసూదన్, ఎస్ఈ మహబూబాబాద్ నరేష్, డీఈలు, ఎస్పీఓ, డీఈ (ఐటి) అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed