మానవత్వం చాటుకున్న ఎస్ఆర్ఆర్ అధినేత పరిపాటి శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 23 |
మానవత్వం చాటుకున్న ఎస్ఆర్ఆర్ అధినేత పరిపాటి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ,రాయపర్తి : అయిన వాళ్లందరినీ కోల్పోయి అనాధగా మారిన బాలికకు నిలువ నీడ కూడా లేకపోవడంతో చలించిపోయిన ఎస్ఆర్ఆర్ ఇన్ఫ్రా చైర్మన్ పరిపాటి శ్రీనివాస్ రెడ్డి ఆ బాలికకు ఇల్లు నిర్మించారు.రాయపర్తి మండల కేంద్రం చెందిన అయితే యాకయ్య అనారోగ్యంతో 11 సంవత్సరాల క్రితం మృతి చెందగా తల్లి కొమరమ్మ గత మూడు నెలల క్రితం మృతి చెందింది దీంతో అనాధగా మారిన చిన్నారి రేణుకను చూసి గ్రామస్తులు చలించిపోయారు. ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఎస్ ఆర్ ఆర్ ఇన్ఫ్రా చైర్మన్ పరిపాటి శ్రీనివాస్ రెడ్డి ఆ చిన్నారికి చేయూతను అందించేందుకు ముందుకు వచ్చారు. పూరి గుడిసెలో ఉంటున్న ఆ చిన్నారి రేణుకకు రెండు లక్షల రూపాయల ఇంటితోపాటు బాత్రూం నిర్మించి అంబేద్కర్ జయంతి రోజు ఆ ఇంటికి ఆ బాలికతో గృహప్రవేశం చేయించారు. అంతేకాకుండా తన అలనా పాలనతో పాటు తన పై చదువుల కోసం కృషి చేస్తానని ఆ చిన్నారికి హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట యాతాకుల మధుకర్ రెడ్డి రవీందర్ రెడ్డి ఉల్లెంగుల నరసయ్య ఐతరాజు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story