మల్హర్‌లో చెక్ 'ఢాం'...

by Dishanational1 |
మల్హర్‌లో చెక్ ఢాం...
X

భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని మల్హర్ మండలంలోగల దబ్బగట్టు శివారులోని మారేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం వరద ప్రవాహనికి కొట్టుకుపోయింది. ఈ ఏడాది మే నెలలో నిర్మించిన చెక్ డ్యాం జులై నెలలో కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి చెక్ డ్యాం వింగ్ వాల్ పూర్తిగా ధ్వంసమైంది. కాగా, చెక్ డ్యాం నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. ఆ పనుల్లో డొల్లతనం కనిపిస్తోంది. పర్సంటేజీలకు కక్కుర్తి పడిన అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిర్మాణ దశలో పర్యవేక్షణ నామమాత్రంగా చేశారు. దీంతో కాంట్రాక్టు ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా నిర్మించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చెక్ డ్యాం చిన్నపాటి వరదకే కొట్టుకుపోవడం నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రూ.16.62కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన చెక్ డ్యాం వరద పాలైంది.

దిశ, మల్హర్: భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని మల్హర్ మండలంలో గల దబ్బగట్టు శివారులోని మారేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం వరద ప్రవాహనికి కొట్టుకుపోయింది. ఈ ఏడాది మే నెలలో నిర్మించిన చెక్ డ్యాం జులై నెలలో కురిసిన భారీ వర్షానికి వచ్చిన వరదకు చెక్ డ్యాం వింగ్ వాల్ మూడు ముక్కలై కొట్టుకుపోయింది. చెక్ డ్యాం నిర్మాణంలో నాణ్యతలో డొల్లతనం కనిపిస్తోంది. కాంట్రాక్టర్ పర్సంటేజీలకు కక్కుర్తి పడిన ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై నిర్మాణ దశలో పర్యవేక్షణ నామమాత్రంగా చేశారు. దీంతో కాంట్రాక్టు ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా నిర్మించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చెక్ డ్యాం నిర్మాణాల నాణ్యత చిన్నపాటి వరదకే కొట్టుకుపోవడం నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రూ.16.62 కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన చెక్ డ్యాం వరద పాలైంది. చెక్ డ్యాం నిర్మాణాల్లో ప్రధాన పాత్ర పెద్దపల్లి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులదే. పర్యవేక్షణ కొరవడడంతో నిర్మాణ పనుల్లో నాణ్యతకు పాతర వేశారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా ఎత్తులో బెడ్ నిర్మించకపోవడం రెండు వైపులా వింగ్ వాల్ నిర్మాణంలో డిజైన్లు, నాణ్యత, పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో చెక్ డ్యాం ధ్వంసమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం ఆప్రాన్ కొట్టుకుపోయింది. వరద ప్రవాహ తీవ్రతను అంచనా వేయకుండా నిర్మించడమే ప్రధాన లోపమని తెలుస్తోంది.

నాణ్యత లోపంతోనే...

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని చిన్న ఓదెల మండలంలోని దబ్బగట్టు మధ్యలో ఉన్న మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం నాణ్యత లోపంతోనే వరద కొట్టుకోపోయిందని మల్లారం ఎంపీటీసీ ఆవిర్నేని ప్రకాష్ రావు మండిపడ్డారు. నీటిపారుదల శాఖ అధికారులు, మంథని నియోజకవర్గం ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడడంతోనే కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులు చేపట్టారు. ప్రభుత్వ నిధులు నీటిలో కలిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే చెక్ డ్యాం పనుల్లో నాణ్యత లోపించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కూలిపోయిన చెక్ డ్యాం స్థానంలో మళ్లీ మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కు: మలహల్‌రావు, చింతలపల్లి, ఎంపీపీ

దబ్బగట్టు శివారులోని మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం నిర్మాణంలో కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కయ్యారు. అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడంతోనే పనుల్లో నాణ్యత లోపించింది. కట్టిన నెలల్లోనే కూలిపోవడంతో నిధులు నీటిపాలయ్యాయి. నీటిపారుదల శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శించడంతోనే చెక్ డ్యాం వరద పాలైందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుని నాణ్యత పరంగా నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed