వెంకటాపురం చెరువులో కోట్ల మట్టి కొట్టుకు పోతుండ్రు

by Disha Web Desk 12 |
వెంకటాపురం చెరువులో కోట్ల మట్టి కొట్టుకు పోతుండ్రు
X

దిశ, హన్మకొండ టౌన్ : వేసవి కాలం వస్తే చాలు ఇటుక బట్టీల కోసం మట్టి మాఫియా చెరువులే లక్ష్యంగా చేసుకుని మట్టిని తరలిస్తున్నాయి. ప్రకృతి వనరులను దోచుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వెంకటాపురం చెరువులో మట్టి మాఫియా దందా మూడు జేసీబీలు.. 60 టిప్పర్లుగా సాగుతోంది. వారి దందా కు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికారులు సైతం పర్మిషన్లు ఉన్నాయంటు వారికి వంత పాడడంలో అంతర్యం ఏమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెరువు మధ్యలో మట్టి తీస్తూ పట్టా భూమిలో మట్టి తీస్తున్నామని, పర్మిషన్ ఉందని ఊదరగొడుతున్నారు.

చెరువులను చెరబట్టిన మట్టి మాఫియా...

చెరువులను చెరబట్టి మట్టి దందాను కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రకృతి సంపద చెరువు మట్టిని విచ్చలవిడిగా టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు తరలిస్తూ లక్షల్లో దందా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువు వరకు వెళ్లే మార్గాన్ని సైతం నిర్మించుకుంటున్నారు. చుట్టు పక్కల ఉన్న రైతుల భుమలును కూడా చేరుపుతు చెరువంత తవ్వకాలు జరుపుతున్నారు అని చుట్టుపక్కల రైతులు ఆరోపిస్తున్నారు.

కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులు..

చెరువులో మట్టి తీయాలంటే ఇరిగేషన్ శాఖ, తహశీల్దార్, మైనింగ్‌శాఖల అనుమతి, గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి తప్పనిసరి. ఒక వేళ పర్మిషన్ ఉన్నవారు ఇచ్చిన పర్మిషన్ గోరంత అయితే మట్టి మాఫియా కొండంత తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఆయా శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మట్టి మాఫియా ముడుపుల రూపంలో అధికారుల కళ్లకు గంతలు కడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పట్టా ఉందని చెప్పమని అధికారులే వారిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో భారీ గుంతలు ఏర్పడడంతో మత్స్యకారులు చేపలు పట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని మట్టి దందాను నిలిపివేయాలని వెంకటాపురం గ్రామస్తులు కోరుతున్నారు.

ఇరిగేషన్ డీ.ఈ వివరణ..

మేము ఎవరికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. వెంకటాపురం వాళ్ళకి కేవలం ఎన్.ఓ.సి మాత్రమే ఇచ్చాము. మట్టి తవ్వకాలకు మైనింగ్ శాఖ అనుమతి కూడా ఉండాలి అన్నారు. ఎన్.ఓ.సి నీ బట్టి మట్టి తీయరాదు. ఒకవేళ తీస్తే మేము అపేసి వారిపై చర్యలు తీసుకుంటాం.



Next Story

Most Viewed