భుజాలు తడుముకుంటున్న అక్రమార్కులు..’దిశ’ కథనంతో అంతా గప్‌చుప్

by Disha Web Desk 23 |
భుజాలు తడుముకుంటున్న అక్రమార్కులు..’దిశ’ కథనంతో అంతా గప్‌చుప్
X

దిశ,డోర్నకల్ : పేద ప్రజల బియ్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది.అక్రమ రవాణా చేస్తూ ఆయా శాఖలోని కొంతమంది అధికారులను మెప్పిస్తూ దందాను నియోజకవర్గంలోని పలు మండలాల్లో యదేచ్చగా కొనసాగించారు.ఇద్దరు ముగ్గురు స్థానిక నాయకులు సైతం అండగా ఉండడంతో రేషన్ బియ్యం దందా జోరుగా సాగింది.అయితే ఈ అక్రమ దందాలోను విపరీతమైన పోటీ ఉండటం అక్రమమైన సంపాదనకు అడ్డు తగులుతున్న వారిని చాకచక్యంగా పట్టిస్తూ తమ వ్యాపారాన్ని జిల్లాలు దాటించేశారు.ఈ నేపథ్యంలో దిశ కథనంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మేము చేయట్లేదు అంటే మేము చేయట్లేదు..!

అక్రమ వ్యాపారాలపై పత్రికల్లో కథనాలు వస్తూ ఉండడం వారంతట వారే మేం చేయట్లేదు అంటే మేము చేయట్లేదు అంటూ పలు చోట్ల చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా అక్రమ బియ్యం దందా మేము బంద్ చేసాము ఇప్పుడు చేయట్లేదు అని పలుచోట్ల చెప్పుకోవడం గమనార్హం.అయితే ఎన్నికల సమయం కావడంతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత అందర్నీ సమదాయించి మళ్లీ ప్రారంభించవచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే వారి వారి అనుచరులు వ్యాపార భాగస్వాముల కు విషయం చేరవేసి రహస్య ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని డంపు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.వారికి సహకరిస్తున్న ఆయా శాఖల అధికారులు కూడా తదనుగుణంగా సలహాలు,సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా వారికి సహకరిస్తున్న కొందరు రేషన్ డీలర్లు సైతం రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని రోజుల పాటు బందు పెట్టడమే మంచిదని ఇప్పటివరకు సంపాదించుకున్నచాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

అప్రమత్తమైన అధికారులు..

రేషన్ బియ్యం భారీ స్థాయిలో పక్కదారి పడుతున్న విషయం తెలుసుకున్న సివిల్ సప్లై అధికారులు అప్రమత్తమయ్యారు.పలు రేషన్ షాపుల్లో స్టాక్ వివరాలు,రికార్డులు త్వరలో తనిఖీ చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ అక్రమ దందాలో పాలుపంచుకున్న రేషన్ డీలర్లకు సైతం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు.సివిల్ సప్లై అధికారులతో పాటుగా రాష్ట్రస్థాయిలో ఇంటెలిజెన్స్,టాస్క్ ఫోర్స్,పోలీస్ శాఖ కూడా అక్రమ దందా పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed