ఏనుమాముల మార్కెట్ కార్యదర్శిగా పోలేపాక నిర్మల

by Sridhar Babu |
ఏనుమాముల మార్కెట్ కార్యదర్శిగా పోలేపాక నిర్మల
X

దిశ, వరంగల్ టౌన్ : ఏను మాముల వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పోలెపాక నిర్మల నియమితులయ్యారు. ఈ మేరకు మార్కెట్ శాఖ సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ లక్ష్మీబాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన సంగయ్య ఏప్రిల్ 31న రిటైర్ అయ్యారు. ఆ స్థానంలో ఇన్చార్జ్ కార్యదర్శిగా జమ్మికుంట మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆస్థానంలో పూర్తిస్థాయి హోదాలో పోలెపాక నిర్మలను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ముందే చెప్పిన 'దిశ'

వరంగల్ మార్కెట్ కార్యదర్శిగా రావడం కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు దిశ దినపత్రిక ముందే వెలుగులోకి తెచ్చింది. వాస్తవానికి జి రెడ్డినే ఇక్కడకు కార్యదర్శిగా వస్తారని అంతా అనుకున్నారు. అయితే జి రెడ్డి కాస్త ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుండడం,

అంతే కాకుండా ఇన్చార్జ్ హోదా లోనే నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం మార్కెట్ అడ్తి, వ్యాపార వర్గాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు కొరుకుడు పడలేదు. దీంతో తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారి కోసం వెతికి వెతికి... చివరకు గతంలో ఇక్కడ కొంత సమయం పనిచేసిన పోలెపాక నిర్మలను ఎంచుకుని, మంత్రులతో మంతనాలు జరిపి వరంగల్ కు నిర్మలను బదిలీ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Next Story