సార్వత్రిక ఎన్నికలలో పుట్ట మధును ప్రజలు చిత్తుగా ఓడిస్తారు..

by Disha Web Desk 20 |
సార్వత్రిక ఎన్నికలలో పుట్ట మధును ప్రజలు చిత్తుగా ఓడిస్తారు..
X

దిశ, కాటారం : పుట్టమధు ఎమ్మెల్యేగా తన పదవికాలంలో అభివృద్ధి చేయకపోవడంతోటే ప్రజలు ఓడించారని, ఈసారి ఎన్నికల్లో నిలబడితే నియోజకవర్గం ప్రజలే చిత్తుగా ఓడిస్తారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. కాటారం మండలంలోని దామెరకుంట గ్రామంలో అసంపూర్తిగా ఉన్నడబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలను బుధవారం పరిశీలించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పుట్టమధు, కాటారం జెడ్పీటీసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని తీసుకురాకుండా, పక్కకు పెట్టడం దామెరకుంట గ్రామంలో శ్రీపాదరావు, శ్రీధర్ బాబు చేసిన అభివృద్ధిపై దామరకుంటలోనే చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. 2016 లో డబుల్ బెడ్రూంలో ఇల్ల నిర్మాణం ప్రారంభమైనా పుట్టమధు వైపల్యంతోనే నిర్మాణం పూర్తి కాలేదని ఆరోపించారు.

నాలుగేళ్లు ఎమ్మెల్యేగా, మూడేళ్లు జడ్పీ చైర్మన్ గా ఉన్నసమయంలోనే మంథనిలో 20 కోట్లతో రాజగృహం, 70 కోట్లతో వెంకటాపూర్ గ్రామంలో ఫామ్ హౌస్, 50 ఎకరాలలో రొయ్యలు చేపల పెంపకం, భవిత చిట్ ఫండ్స్ లో బడులు హైదరాబాదులో వ్యాపారాలు చేస్తూ శ్రీధర్ బాబును విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాటారం నుండి కాంగ్రెస్ కు ప్రజలు మెజార్టీ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో ఎక్కువ రెట్టింపు మెజార్టీతో శ్రీధర్ బాబును గెలిపిస్తారని ప్రెస్టేషన్లో ఉండి పుట్టమధు చేస్తున్న ఆరోపణలు అతనికే తెలియకుండా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

దామెరకుంట గ్రామంలో అన్నారం లక్ష్మీబ్యారేజ్తో వాటర్ తో ఇల్లు, పంటలు దిగిపోయిన పరామర్శకు లేదని పరిహారం ఇప్పించలేదని, నారం బ్యారేజీ ఇసుకతో అక్రమరవాణా చేసి కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో దండుకొని ఈ గ్రామాల ప్రజల భూములు ఇల్లు మునిగిపోయేలా చేసిన చరిత్ర నీదని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆకారం మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాక్షరాలు చీరల తిరుమల- తిరుపతిరెడ్డి, నాయకులు ఆంగోతు సుగుణ, జాడి మహేశ్వరి, కుంభం స్వప్న, మంతెన రాజనర్సయ్య, చీమల రాజు, చీమల సందీప్ లబ్ధిదారులు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed