బీఆర్ఎస్ పార్టీకి పీఏసీఎస్ చైర్మన్ రాజీనామా

by Disha Web Desk 23 |
బీఆర్ఎస్ పార్టీకి పీఏసీఎస్ చైర్మన్ రాజీనామా
X

దిశ,దుగ్గొండి: బీఆర్ఎస్ పార్టీకి మందపల్లి పీఏసీఎస్ చైర్మన్ రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మందపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గుడిపెల్లి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తన రాజీనామా కు గల కారణాలను లేఖలో పేర్కొన్నారు. ఆర్మీలో పని చేసిన తను ప్రజాసేవకై రాజకీయాలలోకి వచ్చిన తనకు గ్రామ, మండల నాయకుల గ్రూప్ తగాదాలతో, సమన్వయ లోపాలతో, పార్టీలో తనను అనేక అవమానాలకు గురి చేశారని, మాజీ ఎమ్మెల్యే పెద్దికి ధన్యవాదాలు తెలుపుతూ రాజీనామా చేశారు.


Next Story

Most Viewed