వరంగల్ ప‌శ్చిమ కాంగ్రెస్‌లో పొలిటిక‌ల్ వార్‌.. మ‌ళ్లీ మొద‌లైన రాజ‌కీయ జ‌గ‌డం

by Disha Web Desk 12 |
వరంగల్ ప‌శ్చిమ కాంగ్రెస్‌లో పొలిటిక‌ల్ వార్‌.. మ‌ళ్లీ మొద‌లైన రాజ‌కీయ జ‌గ‌డం
X

వరంగల్​పశ్చిమ కాంగ్రెస్​లో పొలికట్​లొల్లి షురూ అయ్యింది. హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్​రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్​జంగా రాఘవరెడ్డి టికెట్​కోసం పోటీ పడుతున్నట్టు స్పష్టమైంది. ఇద్దరు నేతలు హాథ్​సే హాథ్​ జోడో అభియాన్​లో భాగంగా పోటా పోటీగా నియోజవకర్గంలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా నాయినికి టికెట్​దక్కలేదు. దీంతో అధిష్టానం వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ డీసీసీ అధ్యక్ష ప‌ద‌విని అప్పగించింది. కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించాడని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మద్దతు సైతం ఉందని నాయిని వర్గీయులు పేర్కొంటున్నారు. మరో వైపు జంగా రాఘవరెడ్డి గత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. దీంతో అధిష్టానం జనగామ డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి జనగామ, పాలకుర్తి నియోజకర్గాల్లో పర్యటించి ఇక్కడి నుంచే పోటీ చేయనున్నట్లు పలుమార్లు పేర్కొన్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా వరంగల్​పశ్చిమ నుంచి పోటీ చేస్తానని, నాయిని స్థానికుడు కాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో పశ్చిమ టికెట్​పోరులో జంగా, నాయిని ఉన్నట్లు తెలుస్తోంది. మరి అధిష్టానం ఎవరికి టికెట్​కేటాయిస్తుందో వేచిచూడాల్సిందే..

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్‌లో పొలిటి క‌ల్ వార్ మొద‌లైంది. హ‌న్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేంద‌ర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవ‌రెడ్డి ఇద్దరూ పశ్చిమ టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేత‌లు పోటాపోటీగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటిస్తున్నారు. హాథ్ సే హాథ్​జోడో అభియాన్ యాత్రను ఇద్దరు నేత‌లు ఏక కాలంలో చేప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో, ప్రజ‌ ల్లో త‌న‌కంటే త‌న‌కే బ‌ల‌ముంద‌ని నిరూపించుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు. వాస్తవానికి గ‌త సంవ‌త్సర కాలంగా ఏదో కార్యక్రమంలో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచే తాను పోటీ చేయ‌ద‌ల్చుకున్నానంటూ జంగా ప్రక‌టిస్తూ వ‌స్తున్నారు.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో పొత్తుల్లో భాగంగా మ‌హా కూటమి అభ్యర్థికి కాంగ్రెస్ ఈ సీటును కోల్పోవాల్సి రావ‌డంతో నాయినికి టికెట్ ద‌క్కలేదు. అయినా పార్టీని ప‌ట్టుకుని ప‌నిచేశార‌న్న భావ‌న అధిష్ఠాన పెద్దల్లో ఉంది. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ డీసీసీ అధ్యక్ష ప‌ద‌విని కూడా అప్పగించ‌డంతో క‌ష్టకాలంలో పార్టీని ముందుండి న‌డిపించిన స‌మ‌ర్థుడనే అభిప్రాయం ముఖ్య నేత‌ల్లో ఉన్నట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌ వ‌ర్గ టికెట్ ద‌క్కుతుంద‌నే ధీమాను నాయిని అనుచ‌రు లు వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మ‌ద్దతు నాయినికి ఉంద‌ని చెబుతున్నారు. హ‌న్మకొండ డీసీసీ బాధ్యత‌లు ఆయ‌న‌కు ద‌క్కడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

నేనున్నానంటున్న జంగా..!

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ రేసులో తాను ఉన్నట్లుగా జంగా సంకేతాలు పంపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే జంగా రాఘ‌వ‌రెడ్డి క్లియ‌ర్‌క‌ట్ పొలిటిక‌ల్ డెషిసన్​ వెల్లడిస్తున్నారు. పాల‌కుర్తి, జ‌న‌గా మ‌, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడ‌లిలో ఉంటూ రాజ‌కీయంగా అస్పష్టమైన వైఖ‌రిని వెల్లడించిన ఆయ‌న మంగ‌ళ‌వారం కాజీపేట‌లో జ‌రిగిన హాథ్​సే హాథ్​జోడోయాత్రలో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచే బ‌రిలోకి దిగ‌నున్నట్లు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేంద‌ర్ రెడ్డితో టికెట్ పోరు ఉంటుంద‌ని అంగీక‌రించిన జంగా, అంతా పార్టీ కోస‌మే ప‌నిచేస్తామ‌ని కూడా పేర్కొన‌డం విశేషం.

గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉంటుంద‌ని, నాయిని రాజేంద‌ర్ రెడ్డి త‌న కోసం ప‌నిచేస్తాడ‌న్న న‌మ్మకం ఉంద‌ని అన్నారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బులు కూడా ఖ‌ర్చు పెడుతానడాన్ని చ‌మ‌త్కారంగా చెప్పారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై తాను బ‌రిలోకి దిగ‌డం, ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర‌వేయ‌డ‌మూ ఖాయ‌మేన‌ని ధీమా వ్యక్తం చేయ‌డం విశేషం. జంగా తాజాగా చేసిన కామెంట్స్ కాంగ్రెస్ వ‌ర్గాల్లో పొలిటిక‌ల్ హీట్‌ను పుట్టిస్తున్నాయి.

పాల‌కుర్తి నుంచి ప‌శ్చిమ‌కు వ‌యా జ‌న‌గామ‌..

అధిష్ఠానం ఎక్కడ అవ‌కాశం క‌ల్పిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాన‌ని చెబుతూ జ‌న‌గామ‌, పాల‌కుర్తి, వ‌రం గ‌ల్ ప‌శ్చిమ నియ‌జ‌క‌వ‌ర్గాల్లో జంగా ప‌ర్యటిస్తూ పోటీదారుల‌కు కాస్త క‌ల‌వ‌రంగానే మారారు. వాస్తవానికి గ‌త ఎన్నిక‌ల్లో పాల‌కుర్తి నుంచి పోటీ చేసి బీఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఓట‌మి అనంత‌రం ఆయ‌న‌కు పార్టీ జ‌నగామ డీసీసీ అధ్యక్ష బాధ్యత‌లు అప్ప గించ‌డంతో సీనియ‌ర్ నేత‌, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మయ్యకు ధీటుగా నియో జ‌క‌వ‌ర్గంలో క్యాడ‌ర్‌ను త‌యారు చేసుకున్నారు. ఇద్దరి నేత‌ల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి తయా రైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌ని కూడా ప‌లుమార్లు ప్రక‌టించారు. ఆయ‌న అనుచ‌రులు కూడా పార్టీలో హ‌డావుడి చేశారు. అయితే ఏమైందో ఏమో గాని కొద్దికాలంగా ఆయ‌న అడ‌ప‌ద‌డ‌పాగా జ‌న‌గామ‌లో ప‌ర్యట‌న‌లు చేస్తున్నారు. ఇక పాల‌కుర్తికైతే ఇటీవ‌ల రేవంత్ రెడ్డి ప‌ర్యట‌న‌కు మిన‌హా పెద్దగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించింది లేద‌నే చెప్పాలి.

స్థానిక బ‌లం వైపే మొగ్గు..!

హ‌న్మకొండ జిల్లా కాజీపేట మండ‌లంలోని టేకుల‌ గూడెం వాస్తవ్యుడైన జంగాకు కాజీపేట ప్రాంత‌పై మం చి ప‌ట్టుంద‌నే చెప్పాలి. ఆయ‌న సొంతంగా ముగ్గురు కాంగ్రెస్ కార్పొరేట‌ర్లను గెలిపించుకోవ‌ డంలో స‌ఫ‌లీ కృత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ప్రాంతం, నియోజ‌క‌ వ‌ర్గంతో సంబంధం లేకుండా జంగాకు అనుచ‌ర‌గ‌ణం ఉన్నమాట వాస్తవం. ఆయ‌న అనుచ‌రుల ఒత్తిడి, వ‌ రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌ వ‌ర్గంలోనే త‌న‌కు స్థాన‌బ‌ లముంద‌ని, రాజ‌కీయంగా క‌లిసి రావ‌ డంతో పాటు కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాన్ని చేజిక్కిచ్చుకునే వ్యూహం తో ఉన్నట్లు స‌మాచారం. వ‌రంగ‌ల్ పశ్చిమ నియో జ‌క‌వ‌ర్గంలో నాయిని వ‌ర్సెస్ జంగా టికెట్ పోరు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. దీనిపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది..? ఎవ‌రికి మ‌ద్దుతుగా నిలుస్తుంద‌న్నదో భ‌విష్యత్తే స‌మాధానం ఇవ్వాల్సి ఉంది.



Next Story