లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్‌పై హత్యాయత్నం

by Web Desk |
లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్‌పై హత్యాయత్నం
X

దిశ, ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా శంభునిపేట విశ్వనాధ కాలనీలో నివాసం ఉంటున్న లారీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భూపాల్‌పై హత్యాయత్నం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు వ్యక్తులు కత్తులతో దాడిచేసి చంపడానికి ప్రయత్నించారు. కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం... లారీ అసోషిషన్ అధ్యక్షుడు భూపాల్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రంజిత్ అనే వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులతో వచ్చి గొడవ పడ్డాడు. గొడవకు దిగుతూనే కత్తితో దాడిచేసే ప్రయత్నం చేశారు. దీనిని గమనించిన భూపాల్ భార్య కల్యాణి ఇంట్లో ఉన్న కారంపొడిని తెచ్చి ఎదురు దాడి చేసింది. దీంతో గొడవకు వచ్చిన వారిలో ఒకరికి తలకు గాయం అయింది. దీంతో స్థానికులు బయటకు వచ్చేసరికి దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. హత్యాయత్నంపై భార్యాభర్తలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.



Next Story

Most Viewed