బడ్జెట్ 'రాస్కోరా సాంబ..' అనే సినిమా డైలాగ్‌లా ఉంది : Revanth Reddy

by Disha Web Desk 13 |
బడ్జెట్ రాస్కోరా సాంబ.. అనే సినిమా డైలాగ్‌లా ఉంది : Revanth Reddy
X

దిశ, ములుగు ప్రతినిధి: 'హాత్ సే హాత్ జోడో' యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి కాసేపు పత్రికా మిత్రులతో ముచ్చటించారు. మేడారం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితోనే పాదయాత్ర చేస్తున్నానని ఆనాడు సమ్మక్క సారలమ్మలు తమ సొంత లాభం కోసం కాకుండా తమ ప్రాంత గిరిజనుల కోసం పోరాడాలని అందుకే ఇక్కడి నుంచి ఈ యాత్ర మొదలుపెట్టామని అన్నారు. అనంతరం ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుతూ.. బడ్జెట్ కు విలువ లేదు, కేసీఆర్ కు బుద్ధి లేదు అని, బడ్జెట్ లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. బడ్జెట్ లెక్కలు వాస్తవ లెక్కలకు చాలా విరుద్ధంగా ఉంది. బడ్జెట్ 'రాస్కోరా సాంబ..' అనే సినీ డైలాగ్ లాగ ఉంది అని విమర్శించారు. సీతక్కతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మేడారం అభివృద్ధిని కేసీఆర్ విస్మరించారు.. మేము అధికారంలోకి వస్తే మేడారం అభివృద్ధి చేస్తాం అని అన్నారు.


Next Story

Most Viewed