ప్రియుడితో భర్తకి దొరికిన సీఐ.. ఒకే స్టేషన్‌లో..

by Javid Pasha |
ప్రియుడితో భర్తకి దొరికిన సీఐ.. ఒకే స్టేషన్‌లో..
X

దిశ, వ‌రంగ‌ల్ బ్యూరో : మ‌హిళా సీఐ ప్రియుడితో భ‌ర్త‌కు రెడ్‌హ్యాడెండ్‌గా చిక్కిన‌ట్లు స‌మాచారం. వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని ఓ ప్ర‌త్యేక విభాగంలో కోలింగ్స్‌గా ప‌నిచేస్తున్న మ‌హిళా సీఐకి.. స‌హ‌చ‌ర సీఐకి వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మ‌హిళా సీఐ భ‌ర్త కూడా పొరుగు జిల్లా కేంద్రంలోని ఓ స్టేష‌న్‌లో సీఐగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల భార్య ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డంతో ప‌క్కాగా నిఘా ఏర్పాటు చేసుకున్న‌ట్లు స‌మాచారం. కొన్ని ఆధారాల‌తో వివాహేత‌ర సంబంధం క‌లిగి ఉంద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

సోమ‌వారం సాయంత్రం స‌హ‌చర సీఐతో చాలా స‌న్నిహితంగా ఉండ‌గా పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా సుబేదారి పోలీస్ స్టేష‌న్‌లో ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుబేదారి పోలీసులు గోప్యంగా విచారిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యంపై సుబేదారి సీఐ వివ‌ర‌ణ కోరేందుకు దిశ వ‌రంగ‌ల్ బ్యూరో ఫోన్ చేయ‌గా స్పందించ‌లేదు. భార్య‌, భ‌ర్త‌, ప్రియుడు అంద‌రూ పోలీస్ శాఖ‌కు చెందిన వారే కావ‌డంతో పోలీస్‌శాఖ‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.Next Story

Most Viewed