శత్రువుకు కూడా హాని చేయని స్వభావం నాది.. ఎమ్మెల్యే గండ్ర..

by Sumithra |
శత్రువుకు కూడా హాని చేయని స్వభావం నాది.. ఎమ్మెల్యే గండ్ర..
X

దిశ, రేగొండ : సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఆదివారం రేగొండ మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్స్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన వేడుకల్లో ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ప్రజల అవసరాలను తెలుసుకుని క్షేత్ర స్థాయిలో కావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కానీ కొండంత చేసిన గోరంత ప్రచారం జరుగుతోందన్నారు. కార్యకర్తల్లో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లెక్క కంకణబద్ధులై ప్రచారం చేయాలని కోరారు. దేశంలో ఎక్కడ ఇవ్వని పంటనష్ట పరిహారం రైతులకు ఇవ్వబోతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. దేశంలో అవినీతి నిర్మూలన సంస్థలు బీజేపీ నాయకుల అహంకారానికి బ్రష్టు పట్టిపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు హింగే మహేందర్, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జడ్పీటీసీ సాయిని విజయ, సొసైటీ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మటిక సంతోష్, అంకం రాజేందర్ మండల మహిళ అధ్యక్షురాలు, అన్నిగ్రామాల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, డైరెక్టర్ లు, గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed