శ్రీనివాస్ గౌడ్‌కు పెరిగిన భద్రత.. కేసీఆర్ తర్వాత ఈయనకేనంట

by samatah |
శ్రీనివాస్ గౌడ్‌కు పెరిగిన భద్రత.. కేసీఆర్ తర్వాత ఈయనకేనంట
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రతను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల మంత్రి పై హత్యకు కుట్ర జరిగిందన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కల్పించిన స్థాయిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు గ్రేహౌండ్స్‌ తో భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. అలాగే సిబ్బంది అత్యాధునిక ఎం 44 వెపన్స్‌తో భద్రతా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది, వాహనాలకు అదనంగా మరో రెండు వాహనాలు, పది మంది సిబ్బందిని పెంచారు. దీంతో ఆదివారం హైదరాబాద్‌లో ఉన్న మంత్రి‌ని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతులు ఇస్తున్నారు.

Next Story