కొమ్మాల లక్ష్మీనారసింహుడి హుండీ లెక్కింపు

by Disha Web Desk 23 |
కొమ్మాల లక్ష్మీనారసింహుడి హుండీ లెక్కింపు
X

దిశ,గీసుగొండ: వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఈవో శేషగిరి,ఆలయ ప్రధానార్చకులు రామ చార్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో,ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కేశఖండన ద్వారా రూ. 1,52,200/-,అష్టోత్తరం ద్వారా రూ. 74300/-, ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 8,90,750/-,శీఘ్ర దర్శనం రూ.4,22,400/-,హుండీ ద్వారారూ. 26,35,096/-,వేలాల ద్వారా రూ.7,50,116/, లడ్డు ప్రసాదం ద్వారా రూ. 5,60,000/- అన్ని కలుపుకుని మొత్తంగా 54,24,862/- రూపాయల వార్షిక ఆదాయం దేవాలయానికి సమాకూరిందని వీరిరు వురు తెలిపారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 30 లక్షలతో రోడ్ల నిర్మాణం,60 లక్షలతో భక్తుల సౌకర్యార్థం మరుగు దొడ్లు,స్నాన వాటికలు నిర్మించి అన్ని విధాల సహకరించారని ఎమ్మెల్యే రేవూరిని ప్రశంసించారు.

ఈవో,ప్రధాన అర్చకులకు సన్మానం ...

జాతరలో సందర్శకులకు అన్ని విధాల మౌలిక వసతులు కల్పించి, అనునిత్యం భక్తులకు అందుబాటులో ఉండి జాతర విజయవంతం చేసిన ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి రామాచారి,ఈవో శేషగిరిలకు పరకాల కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డీ, సాయిలి ప్రభాకర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమ గాని సౌజన్య,ఎంపిటిసి గోపాల్,కమిటీ డైరెక్టర్లు కందికొండ రాజు,డి.రాజు నాయక్,లడే రాజు,వీరేందర్, మండల నరేష్,యార రాజిరెడ్డి, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed