హ‌న్మ‌కొండ కింగ్స్ విక్ట‌రీ.. ఉత్సాహ‌భ‌రితంగా జ‌ర్న‌లిస్టుల క్రీడ‌లు

by Aamani |
హ‌న్మ‌కొండ కింగ్స్ విక్ట‌రీ.. ఉత్సాహ‌భ‌రితంగా జ‌ర్న‌లిస్టుల క్రీడ‌లు
X

దిశ‌, హ‌న్మ‌కొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్-2024 లో భాగంగా రెండో రోజు శుక్రవారం క్రీడలు ఉత్సాహ భరిత వాతావరణంలో సాగాయి. ఉదయం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య, ముఖ్య అతిథిగా హాజరైన కాజీపేట ఏసీపీ తిరుమల్ కు పరిచయం చేశారు. అనంతరం టాస్ వేసి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ప్రాణహిత జట్టుకు హన్మకొండ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో హన్మకొండ కింగ్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు ఆంధ్ర జ్యోతి డెస్క్ ఇన్ చార్జ్ మైనం సుధాకర్, దిశ బ్యూరో చీఫ్ ఆరెల్లి కిరణ్ శుభారంభం చేశారు.

సుధాక‌ర్ సూప‌ర్ సెంచ‌రీ..

మైదం సుధాకర్ ప్రెస్ క్లబ్ చరిత్రలోనే తొలిసారిగా సెంచరీ చేశాడు. కేవ‌లం 41 బంతుల్లో 111 పరుగులు (నాటౌట్) చేసి 270 స్ట్రైక్ రేట్ తో సంచలనం సృష్టించారు. 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి హన్మకొండ కింగ్స్ 192 పరుగులు చేశారు. ఈ టీం చేసిన మొత్తం పరుగులు కూడా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. తొలిసారి సెంచరీ సాధించిన మైనం సుధాకర్ కు జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక శుక్రవారం యంగ్ బ్యూరోలకు, వరంగల్ రాక్స్ జట్ల మధ్య పోటీ జరగగా యంగ్ బ్యూరోస్ విజయం సాధించారు. అలాగే నమస్తే తెలంగాణ డెస్క్-లగాన్ టీం కి మ్యాచ్ జరగగా లగాన్ టీం విజయాన్ని అందుకుంది. సాక్షి డెస్క్ టీంతో వరంగల్ ఈస్ట్ డ్రాగన్స్ త‌ల‌ప‌డ‌గా సాక్షి డెస్క్ టీం ఘ‌న విజ‌యం సాధించింది.
Next Story

Most Viewed