ఇది కాశ్మీర్ అనుకుంటే పొరపాటు.. ములుగు జిల్లాలో వడగళ్ల వాన..

by Disha Web Desk 13 |
ఇది కాశ్మీర్ అనుకుంటే పొరపాటు.. ములుగు జిల్లాలో వడగళ్ల వాన..
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లో గురువారం వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం నుంచి ఉక్కపోతతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయానికి ఒక్కసారిగా చల్లబడడం తో పాటు.. చిరుజల్లులతో వర్షం మొదలై కొద్దిసేపటికే భారీగా వడగళ్ల వర్షం ఈదురుగాలులతో బీభత్సం సృష్టించింది. భారీగా పడ్డ వడగళ్ల తో రోడ్ల పైన, ఇంటి పై కప్పుల పై వడగండ్లు కుప్పలుగా పరుచుకొని మంచు ఎడారిలా కనిపించింది.

అధిక ఉష్ణోగ్రత తో బాధపడుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం తెలియడం వాతావరణం చల్లగా మారినప్పటికీ వడగళ్ల వర్షం కురవడంతో మండలంలోని పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో సైతం వర్షాలు కురిశాయి. రైతులు వేసిన మొక్కజొన్న, మిరప, వరి లాంటి ప్రధాన పంటలు అకాల వర్షం మూలాన నేలకొరిగాయి.

ములుగు జిల్లాలో వడగళ్ల వాన.. వీడియో: https://www.youtube.com/shorts/GkpVHE4wXME



Next Story