ధాన్యం డబ్బుల కోసం రైతుల ధర్నా

by Dishafeatures2 |
ధాన్యం డబ్బుల కోసం రైతుల ధర్నా
X

దిశ, కాటారం: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించి నెలలు గడిచినా డబ్బులు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాపల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్, లక్ష్మీపురం, దామెరకుంట, గ్రామాలకు చెందిన రైతులు ఖరీఫ్ సీజన్ లో డీసిఎంఎస్ కు చెందిన నాలుగు, ఒకటి మాక్సే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించారు. డబ్బుల కోసం కొనుగోలు నిర్వాహకుల దగ్గరికి వెళ్లి ఎన్ని మార్లు అడిగినా ఫలితం లేదు. చివరకు దిక్కు తోచని స్థితిలో డబ్బుల కోసం కాటారంలోని 353 సి జాతీయ రహదారిపై లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుమారు వందమంది రైతులు రాస్తారోకో నిర్వహించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన ధాన్యం విక్రయించిన రైతులకు సుమారు ఒక కోటి 80 లక్షలు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. విలాసాగర్ , దామరకుంట , గుండ్రాత్రాపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల రైతులు చాలా మందికి కోట్ల రూపాయలలో డబ్బులు రావాల్సి ఉందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం డబ్బులు రావడంలేదని ప్రజాప్రతినిధులకు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని రైతులు ఆరోపించారు. జిల్లా సివిల్ సప్లై డిఎం వైఖరి కారణంగానే డబ్బులు రావడంలో ఇక్కట్ల కు గురవుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..రైతులు చేసిన ధర్నాకు ఏ పార్టీ సంఘీభావం తెలిపేందుకు రాకపోవడం ఈప్రాంత రైతుల దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. రైతులు సుమారు అరగంట సేపు జాతీయ రహదారిపై ధర్నా చేసి నిరసన వ్యక్తం చేయగా ధర్నా స్థలం నుండి పోలీస్ కానిస్టేబుల్ కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు తో మాట్లాడించారు. సమస్య పరిష్కరించేందుకు, సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు ధర్నా చేస్తున్న రైతులందరిని కాటారం పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. సింగిల్ విండోల ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు చెల్లించడంలో గతంలో ఏనాడూ నెలలు జాప్యం జరగలేదని రైతులు తీవ్రంగా ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకొని డబ్బులు త్వరగా వచ్చేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు.




Next Story

Most Viewed