ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 11 |
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, దుగ్గొండి: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి, కూలీలకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోకజవర్గం దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి పోస్టుకార్డుల ద్వారా ఉపాధిహామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నిర్వహించ తలపెట్టిన ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని రైతులతో కలిసి మంత్రి దయాకర్ రావు ప్రారంభించారు.

అనంతరం రూ. 4 కోట్ల 41 లక్షలతో వెంకటాపురం నుంచి మహ్మదాపురం మీదుగా నర్సంపేట మండలం రాజేశ్వరావుపల్లి గ్రామం వరకు నూతన బీటి రోడ్డు పనులకు, రూ. కోటి 20 లక్షలతో మహ్మదాపురం గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖాడే, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్ రెడ్డి, మహదాపురం పీఏసీయస్ ఛైర్మెన్ ఉరటి మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజేశ్వర్ రావు, ఎంపీటీసీ చింత లావణ్య యుగేందర్, మండల నాయకులు శెంకేశి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story