శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు : సీఐ

by Aamani |
శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు  :  సీఐ
X

దిశ, పెద్దవంగర : శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సీఐ సత్యనారాయణ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అవుతా పురం, పోచంపల్లి గ్రామాల్లో కేంద్ర బలగాలతో ప్లగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని ఉద్దేశంతో ప్లగ్ మార్చ్ నిర్వహించామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు, కేంద్ర బలగం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.Next Story

Most Viewed