ఎర్రటి ఎండలో ఆశాల అవస్థలు..

by Disha Web Desk 20 |
ఎర్రటి ఎండలో ఆశాల అవస్థలు..
X

దిశ, డోర్నకల్ : ఎర్రటి ఎండలో ఆశ కార్యకర్తల అవస్థలు వర్ణనాతీతం. మండల పరిధి అమ్మపాలెం పల్లె దవాఖానలో నీటి కష్టాలు అన్ని ఇన్ని కావు. గత ఏడాది క్రితం 16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సబ్ సెంటర్ భవనం సమస్యల వలయంగా మారింది. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది, రోగుల కోసం భవనం పైన నిర్మించిన నీటి ట్యాంక్ గత ఆరు నెలలుగా పనిచేయడం లేదని రెండవ ఏఎన్ఎం సువర్ణ తెలిపారు.

నీళ్లు నింపినా ఉండడం లేదని అన్నారు. నిత్యవసరాలకు (మరుగుదొడ్లకు) బకెట్ల ద్వారా బయటి నుంచి నీళ్లు మోసుకొస్తున్నట్లు తెలియజేశారు. తొమ్మిది మంది మహిళా సిబ్బంది, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తేదారుని కక్కుర్తి స్పష్టంగా కనబడుతుందన్నారు. పల్లెదవాఖానకు వచ్చే రోగులు ఇంటి వద్ద నుంచే మంచి నీళ్లు తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. గుత్తేదారుడు వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed