ఫారెస్ట్‌లో ఎరియాలో మొదలైన టోల్ బాదుడు

by Disha Web Desk 12 |
ఫారెస్ట్‌లో ఎరియాలో మొదలైన టోల్ బాదుడు
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో పశ్ర వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి 163 పై అటవీ శాఖ అధికారులు పర్యావరణ మెయింటెనెన్స్ చార్జెస్ పేరుతో వాహనదారుల నుంచి రుసుమును వసూలు చేస్తున్నారు. ములుగు జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారి 163 పై అటవీ శాఖ అధికారులు బుధవారం నుంచి కొత్త తరహా రుసుమును వాహనదారుల నుంచి వసూలు చేస్తున్నారు. పసర వన్యప్రాణి విభాగం నుండి పస్రా -ఏటూరు నాగారం చెక్ పోస్ట్‌ల వద్ద జాతీయ రహదారిపై వచ్చిపోయే వాహనాల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి వాహనాన్ని బట్టి 200, 50 మెయింటెనెన్స్ చార్జెస్ పేరుతో వసూలు చేస్తుండటంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పస్రా-ఏటూర్ నాగారం మధ్య గల అటవీ ప్రాంతంలో నూతనంగా బుధవారం నుండి పర్యావరణ మెయింటెనెన్స్ చార్జెస్ పేరుతో అధికారులు ఇలా వసూలు చేస్తుండటం పై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం కావడంతో మెయింటెనెన్స్ పేరుతో టోల్ వసూలు చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నా.. వసూలు చేసే ధరలను మాత్రం వాహనదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ముందస్తు సమాచారం లేకుండా వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్న అటవీశాఖ అధికారులను వాహనదారులు తప్పుపడుతూ జాతీయ రహదారిపై తమ వాహనాలను నిలిపి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వెళ్లే వాహనాలకు రోడ్ టాక్స్‌తో పాటు, టోల్ ప్లాజా వద్ద టోల్ కడుతున్న మళ్లీ అటవీ మెయింటెనెన్స్ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాహనదారుల నిరసన..

పస్రా, ఎటు నాగారం మధ్యలో అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద మెయింటెనెన్స్ పేరుతో వసూలు చేస్తున్న టోల్ పై వాహనదారులు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. వాహనదారుల నుంచి 50, 200 వరకు వసూలు చేయడం సామాన్యులకు భారమైన పరిస్థితి అంటూ వాహనదారులు వాపోతున్నారు. వాహనాలకు రోడ్ టాక్స్ పేరుతో ముందే రుసుము చెల్లించిన ప్పటికీ మరల టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించి వచ్చే వాహనాలకు ఫారెస్ట్ అధికారులు ఇలా రుసుము వసూలు చేయడం వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు వాపోతున్నారు.


Next Story

Most Viewed