బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Disha Web Desk 20 |
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, రాయపర్తి : రాష్ట్రంలో పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన తెలంగాణ ప్రజలు గోసపడేవారని, కనీస అవసరాలైన త్రాగునీరు, సాగునీరు సరిగా అందేది కాదన్నారు. కానీ కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ నడుం బిగించారన్నారు. కృష్ణా, గోదావరి జలాలను తీసుకువచ్చి త్రాగునీరు, సాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు.

నాడు కరెంటు సరిగా లేక నీరు లేక పంటలు ఎండిపోయేవని.. ఇప్పుడు 24 గంటల కరెంటుతో రైతులు పంటలు పండించుకుని ఆనందంగా గడుపుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దేశంలో కూడా మన పార్టీ దూసుకుపోతుందని అన్నారు. మనరాష్ట్రంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అందించడం లేదని అన్ని రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని గత 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించిన కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

అడగకుండానే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మెప్పు పొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులు గజమాలవేసి ఎర్రబెల్లి దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మూనావత్ నరసింహ నాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, నాయకులు ఆకుల సురేందర్రావు, పూస మధు, ఎండీ అషరఫ్, సర్పంచులు గారి నరసయ్యచ, కుమార్ స్వామి, వెంకట్రావు, లేతాకుల సుమతి యాదవ రెడ్డి, ఎంపీటీసీలు భూక్య క్రాంతి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed