కన్నీరు కార్చి బతిమిలాడినా కనికరం చూపలేదు (వీడియో)

by Web Desk |

దిశ, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను అధికారులు బాధితులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డు వెడల్పు, డ్రైనేజీ నిర్మాణం పేరుతో కూల్చివేతలకు దిగారు. దీంతో తమకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలకు దిగడం ఏంటని పట్టణవాసుల ఆందోళన వ్యక్తం చేశారు. రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లను అక్రమంగా కూల్చి వేస్తున్నారని బాధితులు కన్నీరు కార్చి బతిమిలాడినా కనికరం లేకుండా కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 జేసీబీలు 60 మంది పోలీసుల పహారాలో ఇండ్లను తొలగించారు. మున్సిపల్ అధికారులు దగ్గరుండి పోలీస్ పహారా మధ్య కూల్చివేయడం దారుణమని బాధితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఫీట్లకు నోటీస్ ఇచ్చి, 55 ఫీట్లకు పైగా ఇండ్లు కూలుస్తున్నారంటూ అధికారులను బాధితులు అడ్డుకోగా పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వర్ధన్నపేటలో ఉద్రిక్తతల మధ్య ఇండ్ల కూల్చివేతలు జరిగాయి.

ఖద్దర్ బట్టలకో న్యాయం.. కామన్ మ్యాన్‌కు మరో న్యాయం

ఖద్దరు బట్టలు ధరించి, పైరవీలు చేసే వ్యక్తుల ఇళ్లను వదిలి రెక్కలు ముక్కలు చేసుకొని, కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడంతో మున్సిపల్ అధికారుల తీరుపై పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గూడు చెదిరింది.. మా గోడు వినేది ఎవరు?

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారికి ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇళ్లను మున్సిపల్ అధికారులు బాధితులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంపై పలువురు రాజకీయ నాయకులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేదలు నివసిస్తున్న గూడును చెడగొడుతున్నారు సరే, తర్వాత మా గోడు వినేది ఎవరు? అంటూ కొంతమంది బాధితులు అధికారులను నిలదీశారు.

అధికారుల సముదాయింపు.. అడ్డుపడితే అరెస్టులు

నివాసముంటున్న ఇళ్లను కూల్చడంతో కుటుంబంతో సహా రోడ్డున పడుతున్నాము సార్ అంటూ కొంతమంది బాధితులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఏసీపీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అడ్డుపడుతున్న బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేశారు.

https://youtu.be/S5P5ywyKcCs



Next Story

Most Viewed