మహేశ్వరం మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

by Disha Web Desk 11 |
మహేశ్వరం మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, మహేశ్వరం: మహేశ్వరం మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ బి.ధనుంజయ్ గురువారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సంలో అడ్మిషన్ పొందుటకు మే 9వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మహేశ్వరం మోడల్ స్కూల్లో అప్లై చేసుకోవాలన్నారు. ఎంపీసీలో 40 సీట్లు, బైపిసిలో 40సీట్లు, సీఈసీలో 40సీట్లు, ఎమ్ఈసిలో 40సీట్ల చొప్పున మొత్తం 160సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదవ తరగతిలో పొందిన జీపీఏ మార్కుల ఆధారంగా కోరుకున్న కోర్సులో ప్రవేశం లభిస్తుందన్నారు. ఆసక్తి గల విధ్యార్థులు పదో తరగతి పాసైన ఆన్లైన్ మెమో,ఆధార్ కార్డు ,రెండు ఫోటోలతో మహేశ్వరం మోడల్ స్కూలుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ప్రాతిపదికన ప్రవేశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వివరాలకు 984974656, 9603150011 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.



Next Story

Most Viewed