బైరి నరేష్‌పై బ్రాహ్మణ హిందుత్వ మతోన్మాదుల దాడి హేయం.. కరపత్రం విడుదల చేసిన మావోయిస్టులు

by Disha Web Desk 1 |
బైరి నరేష్‌పై బ్రాహ్మణ హిందుత్వ మతోన్మాదుల దాడి హేయం.. కరపత్రం విడుదల చేసిన మావోయిస్టులు
X

దిశ, ములుగు ప్రతినిధి : ఇటీవల ఏటూరు నాగారం మండల కేంద్రంలో జరిగిన బీమాకొరేగాం స్ఫూర్తి దినోత్సవానికి హాజరైన బైరి నరేష్‌పై బ్రాహ్మణ హిందుత్వ మతోన్మాదులు చేసిన దాడిని ఖండిస్తూ.. మావోయిస్టులు కరపత్రాన్ని విడుదల చేశారు. అయితే అందులో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు), ఏటూరు నాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ, కార్యదర్శి సబిత పేరుతో విడుదలైన కరపత్రం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖలో భారత నాస్తిక సంఘం ఆధ్వర్యంలో బీమాకొరేగాం స్ఫూర్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్న వాళ్లపై బ్రాహ్మణ హిందుత్వ మతోన్మాదులు చేసిన దాడిని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండిచాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బైరి నరేష్ దాడికి పాల్పడిన కేసులు నమోదు చేయకుండా దాడికి గురయిన వారిపై కేసులు నమోదు చేసి హిందుత్వ ఫాసిస్టులకు పోలీసులు కొమ్ముకాశారని ఆరోపించారు.

దేశలో ఉన్నోళ్లందని కులాలు, మతాలుగా విభజిస్తూనే అందరి హిందువుల్లాగే ఉండాలనే కుట్రలో భాగంగానే బీజేపీ, ఆర్ఎఎస్ఎస్, సంఘ్ పరివార్ సంస్థలు కుట్రలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. బ్రహ్మణీయ హిందుత్వ మతోన్మాదులు ఆదివాసులపై, దళితులపై చేస్తున్న దాడులను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. దాడికి ప్రధాన కారకుడైన పూజారి రాధాకృష్ణతో పాటు అతడి అనుచరులపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాస్తికవాదులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని అన్నారు. దళితులు, ఆదివాసులపై, మైనారిటీలపై దాడికి కారణమైన ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్తులు లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed