డిపోలో ఇష్టా రాజ్యం.. అధికారిక వ‌సూళ్లకు తెగ‌బ‌డుతున్న అధికారిణి

by Disha Web Desk 23 |
డిపోలో ఇష్టా రాజ్యం.. అధికారిక వ‌సూళ్లకు తెగ‌బ‌డుతున్న అధికారిణి
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : చెప్పేవి నీతులు.. చేసేవి అక్ర‌మాలు అన్న‌ట్లుగా ఉంది హ‌న్మ‌కొండ జిల్లా గుండ్ల సింగారంలోని ఐఎంఎల్ డిపోలోని అధికారిణి తీరు. మ‌ద్యం స‌ర‌ఫ‌రాలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా జ‌బ‌ర్ద‌స్తీగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న అధికారిణి.. మీడియాలో క‌థ‌నాలు వ‌స్తే మాత్రం త‌న‌కేం అవుతుందంటూ డాంబికాలు ప‌లుకుతున్న‌ట్లు విశ్వ‌సనీయంగా తెలిసింది. డిపోలో జ‌రుగుతున్న అక్ర‌మాలు, అవినీతి చ‌ర్య‌ల‌పై దిశ దిన‌ప‌త్రిక‌లో ఆదివారం క‌థ‌నం వెలువ‌డిన విష‌యం పాఠ‌కుల‌కు విదిదిత‌మే. డిపోలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న అధికారిణి విధుల్లో దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న విష‌యంపై క‌థ‌నంలో ఎండ‌గ‌ట్టింది. హుకూం శీర్షిక‌తో ఆదివారం సంచిక‌లో గుండ్ల సింగారం ఐఎంఎల్ డిపోలో అధికారిణి ప‌నితీరుపై స‌మ‌గ్ర‌మైన క‌థ‌నం వెలువ‌డింది. ఈ క‌థ‌నం ఎక్సైజ్ శాఖ‌లో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌ద్యం వ్యాపారులు దిశ ప్ర‌తినిధికి ఫోన్ చేసి... డిపోలో జ‌రుగుతున్న అక్ర‌మాలు, అధికారిణి వ‌సూళ్ల‌పై స‌మాచారం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

షాపున‌కు రూ.1500 ఇవ్వాల్సిందేన‌ట‌..

గుండ్ల సింగారం మ‌ద్యం డిపో నుంచి స‌రుకును తీసుకెళ్తున్న దాదాపు 200 దుకాణాల‌కు పైగా ఉన్న నిర్వాహాకులు నెల‌నెలా బిల్లుల‌కు రూ.1500 అద‌నంగా ఇచ్చుకోవాల్సిందేనంటూ వాపోతున్నారు. వాస్త‌వానికి బిల్లులు స్కాన్ చేసే సిబ్బంది ద్వారా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న అధికారిణి వారి నుంచి కూడా స‌ద‌రు మొత్తం క‌లెక్ట్ చేసుకుని వారికి నామ‌మాత్రంగా అంద‌జేస్తూ మొత్తం తానే మింగేస్తోంద‌ని తెలుస్తోంది. సుమారు 200ల‌కు పైగా ఉన్న మ‌ద్యం దుకాణాల నుంచి కేవ‌లం బిల్లు రెడి చేసినందుకు నెల‌కు రూ.3ల‌క్ష‌ల‌కుపై అక్ర‌మార్జ‌న డిపో సిబ్బందికి చేరుతుండ‌గా, ఇందులో సింహ‌భాగంగా మేడ‌మ్ మింగేస్తున్నారంట‌. ఇదిలా ఉండగా రోజూవారీగా టీపీ గేట్ కింద కూడా రూ.300 వ‌సూళ్లు పాల్ప‌డుతుండ‌టం అధికారిని అక్ర‌మాల రేంజ్‌కు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి.

హ‌మాలీల‌ను వ‌ద‌ల‌ని అధికారిణి..

త‌న అక్ర‌మార్జ‌న‌కు ఏ అవ‌కాశాన్ని వ‌ద‌ల‌ని అధికారిణి.. హ‌మాలీల నుంచి అమ్యామ్యాల‌ను వ‌ద‌ల‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అన్లోడ్‌కు అనుమ‌తించినందుకు గాను ఒక్కో వాహ‌నం నుంచి రూ. 500 చొప్పున వసూళ్లు చేస్తోంది. రోజుకి నాలుగు ట్రక్కులు మించి దిగుమతి చేయడానికి ఒప్పుకోవడం లేదని, రోజుకు నాలుగు ట్రక్కుల కంటే ఎక్కువ దిగుమతి చేస్తే హమాలీలు ఎక్కువ పైసలు వచ్చి పని చేయరని హుకుం జారీ చేసి రోజుకు నాలుగు బండ్లు మాత్రమే అన్లోడ్ చేపిస్తోంద‌ని వారు వాపోతుండ‌టం గ‌మనార్హం. ఇదిలా బ్రేకేజ్‌లు వ‌చ్చాయ‌ని దొంగ లెక్క‌లు చూపిస్తూ ,బ్రేకేజ్ ల ద్వారా వచ్చిన బాటిళ్ల‌ను త‌న‌కు తెలిసిన షాపు య‌జ‌మానుల‌కు అప్ప‌గిస్తూ సొమ్ము చేసుకుంటున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం.. ఈ ద‌ర‌హా అక్ర‌మంలో ఆరి తేరిన స‌దరు లేడీ అధికారిణి ఏకంగా ల‌క్ష‌ల్లో డ్యామేజీ రిపోర్టుల‌ను చూపిస్తూ.. భారీ మొత్తంలో స్వాహా చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై డిపార్ట్‌మెంట‌ల్ రికార్డు వెరిఫికేష‌న్ తోపాటు స‌మ‌గ్ర‌మైన విచార‌ణ చేప‌డితే అధికారిణి అక్ర‌మాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మ‌ద్యం వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. డిపోలో కీల‌క స్థానంలో ఉన్న అధికారిణి తీరుపై మ‌ద్యం వ్యాపారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న ఉన్న‌తాధికారి ప‌ట్టింపులేని విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఇప్ప‌టికై విచార‌ణ చేప‌డుతారా..?లేదంటే ష‌రా మాములుగానే వ‌దిలేస్తారా వేచి చూడాలి.?


Next Story

Most Viewed