దుగ్గొండిలో అ'పూర్వ' సమ్మేళనం..

by Disha Web Desk 23 |
దుగ్గొండిలో అపూర్వ సమ్మేళనం..
X

దిశ,దుగ్గొండి: జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులేనని (2007-08) నాటి విద్యార్థులు పేర్కొన్నారు. మండలంలోని కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2007- 08లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాలలోను, ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగంలో స్థిరపడిన వారు ఆదివారం 14 వ తేదీన పాఠశాల ఆవరణలో కలుసుకుని, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి మరపురాని మధురమైన సంఘటనలు, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకుని ఆద్యంతం ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. గురువులు జి. సాయన్న, కాంతయ్య, సదాశివ, రవి, బ్రహ్మం లను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. నాటి గురువులను ఘనంగా సత్కరించారు. చదువు చెప్పిన గురువులను మరచిపోకుండా వారిని గౌరవించడం భాద్యతగా భావించి సత్కరించమన్నారు. ఆత్మీయ సమ్మేళనం వారంతా ఏర్పాటు చేసుకున్నారు. క్లాస్‌ మేట్స్‌, బెంచ్‌మేట్స్‌ ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

ఆనాటి అధ్యాపకులు తమ పట్ల చూపిన అభిమానానికి ఆ పూర్వ విద్యార్థులు పాదాభివందనంతో, ఘనంగా శాలువాల సత్కరించి గౌరవించారు. ఆనాటి విద్యార్థులకు చదువు చెప్పిన అప్పటి గురువులకు జ్ఞాపికలను అందజేశారు. మిగిలిన స్నేహితులుతో నెల నెలా ప్రతి ఒక్కరూ కలిసి ఎవరైనా అనారోగ్య కారణంతో ఆర్థికంగా సతమతమవుతున్న వారితో చదువుకున్న వారికి ఆర్దిక సహాయం అందిస్తామని తెలియజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడిపారు. వివిధ రంగాలలో తమ స్నేహితులు మంచి హోదాలో ఉండడం కొందరు స్వయం ఉపాధిలో మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు పర్లపల్లి ప్రతాప్, కందికొండ రాజు, కుడుతల నిశాంత్, ముప్పురపు రాజు, ఊరటి ప్రతాప్, ఇల్లందుల నాగరాజు, భార్గవి, శ్వేత, కల్పన, కీర్తన, అనిత, శ్రావణి, రాధిక తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed