కేయూ నూతన రిజిస్ట్రార్‌గా ఆచార్య పి. మల్లారెడ్డి

by Aamani |
కేయూ నూతన రిజిస్ట్రార్‌గా  ఆచార్య పి. మల్లారెడ్డి
X

దిశ, కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయ నూతన రిజిస్ట్రార్ గా ఆచార్య పి. మల్లారెడ్డి ను నియమిస్తూ ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబు ఉత్తర్వులు జారీచేశారు. ఆచార్య పి. మల్లారెడ్డి ప్రస్తుతం పరీక్షల నియంత్రణాధికారి గా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో నిక్కచ్చిగా ఉండి ఉద్యోగులతో కలుపు గొలుపు స్వభావంతో ఉండే ఆచార్య పి.మల్లారెడ్డి కి రిజిస్ట్రార్ పదవి రావడం పై వీసీ, పలువురు అభినందించారు. అలాగే దూర విద్యా కేంద్ర సంచాలకులుగా ఆచార్య వి.రామచంద్రం, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల (కో ఎడ్యుకేషన్) ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా ఆచార్య ఎం. సదానందం, పరీక్షల నియంత్రణ అధికారి గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆచార్యలు ప్రొ ఎస్ నరసింహ చారి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ గా ప్రొ పి. అమర వేణి, యూనివర్సిటీ పి.జి.కళాశాల, సుబేదారి, హనుమకొండ ప్రిన్సిపాల్ గా ప్రొ పి.వరలక్ష్మి, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఎటీబీటీ ప్రసాద్, ను నియమిస్తూ రిజిస్ట్రార్ ప్రొ టి శ్రీనివాస రావు ఉత్తర్వులు జారీచేశారు.

Next Story