క్వారీలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

by Dishaweb |
క్వారీలో ప్రమాదవశాత్తు  వ్యక్తి మృతి
X

దిశ,నెల్లికుదురు: గ్రానైట్ క్వారీలో ట్రాక్టర్ పల్టీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం మీత్య తండా గ్రామ పరిధిలో క్వారీ లొ చోటుచేసుకుంది. నెల్లికుదురు ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం ఇనుగుర్తి గ్రామానికి చెందిన పసునూరి శ్రీను (40) ట్రాక్టర్ డ్రైవర్ మంగళవారం ట్రాక్టర్ నడుపుకుంటూ క్వారీ లోని ర్యాంప్ లోకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు అట్టి ట్రాక్టర్ బోల్తా పడి తలకు తీవ్ర గాయాలు కాగా ఎంజీఎం వరంగల్ ఆసుపత్రికి చికిత్స గురించి తీసుకు వెళ్లి చికిత్స చెయ్యిస్తుండగా మృతి చెందినాడని మృతుని తండ్రి పసునూరి ఇచ్చిన ఫిర్యాదు పై ఎస్సై క్రాంతి కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సంఘటనపై మహాలక్ష్మి క్వారీ యాజమాన్యం ప్రమాదం జరిగిన వెంటనే వ్యక్తిని కాపాడడానికి స్పందించకపోవడంపై. ఇనుగుర్తి గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని మృతునికి న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed