2023 -24 వానాకాలం సీఎంఆర్ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

by Disha Web Desk 23 |
2023 -24 వానాకాలం సీఎంఆర్ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్
X

దిశ, జనగామ: 2023 - 24 వానాకాలం సీఎంఆర్ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ తో కలిసి రైస్ మిల్లర్లతో వానాకాలం సీఎంఆర్ లక్ష్యాలపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 2023 - 24 వానాకాలం సీఎంఆర్ లక్ష్యం 21 శాతంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ సీజన్లో 80,864 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతైందన్నారు. ఇందులో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) 54,179 మెట్రిక్ టన్నులు కాగా 11,350 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తయిందని అన్నారు.

మిగిలి ఉన్న ధాన్యం లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని మిల్లర్లను ఉద్దేశించి ఆదేశించారు. జిల్లాలో బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన రోజూవారీ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ సీఎంఆర్ లక్ష్యాలపై ఎవరైనా మిల్లర్లు అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గన్నీ బ్యాగులను సరైన విధంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారిణి ఎం.రోజా రాణి, సివిల్ సప్లైస్ మేనేజర్ డీఎం ప్రసాద్, డీటీ సీఎస్ శ్రీనివాస్, దేవా, మిల్లు అధ్యక్షుడు బెల్లీ వెంకన్న, బజ్జురి జయ హరి, శ్రీధర్, తదితర రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed