ఇంటర్ ఫలితాలలో వనపర్తి జిల్లా హవా.. అత్యుత్తమ మార్కులతో సత్తా చాటిన విద్యార్థులు..

by Disha Web Desk 11 |
ఇంటర్ ఫలితాలలో వనపర్తి జిల్లా  హవా.. అత్యుత్తమ మార్కులతో సత్తా చాటిన విద్యార్థులు..
X

దిశ, ప్రతినిధి వనపర్తి: ఇంటర్మీడియట్ 2023 పరీక్ష ఫలితాలలో వనపర్తి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.

అత్యుత్తమ మార్కులు సాధించి వనపర్తి జిల్లాకు రాష్ట్రస్థాయిలో పేరు తీసుకొచ్చారు.

జాగృతి విద్యార్థుల ప్రతిభ..

ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో జాగృతి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కుల గాను 989 మార్కులు సాధించి దేవిక సత్తా చాటగా శ్రావణి 985, శృతి 984, సాధక ఫిర్దోస్ 984, మార్కులు సాధించగా, బైపీసీలో వైష్ణవి 988, సీఈసీలో ప్రవీణ్ 971 మార్కులతో చక్కటి ప్రతిభ కనబరిచారు. ఇక మొదటి సంవత్సరం ఎంపీసీలో సానియా ఖాన్ 470 మార్కుల గాను 465, నిశిగ్న 464, మేఘన 463, అంజలి 462, అక్షిత 462, మానస 461, రంగనాథ్, సాయి ప్రవీణ్ లు 461 మార్కులు సాధించారు. బైపిసి లో నికిత 440 మార్కుల గాను 433 సాధించగా మహేష్ 433, సునీల్ 431 మార్కులు పొందారు. అలాగే సీఈసీ లో మేఘన 447, మాధవి 432 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు.

సివి రామన్ కళాశాల విద్యార్థుల ప్రతిభ..

ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో సీవీ రామన్ కళాశాల విద్యార్థులు పల్లవి 988, అలేఖ్య 986, గాయత్రి శిరీషలు సైతం 986 మార్కులు సాధించారు. అలాగే బైపిసి లో సుమిత్ర 982, హంస వాహిని రెడ్డి 980, వెంకటేష్ 980 ఉత్తమ మార్కులు సాధించారు. ఇక ఎంఈసీలో శుభాంగి 961, శివకుమార్ గౌడ్ 911, సీఈసీ లో సౌమ్య 967, రాజేశ్వరి 952 మార్కులు పొందారు. ఇక మొదటి సంవత్సరం ఎంపీసీలో లావణ్య 466, నిఖిత 465, తన్మయ శ్రీ 464, సాయి తేజ 464 మార్కుల తో సత్తా చాటగా బైపీసీలో అశోక్ 430, వైష్ణవి 425, ఎంఈసిలో గోవర్ధన్ 493, రిషిక 492, రేష్మ 468, మదన గోపాల్ 462 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కాగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అధ్యాపక బృందం అభినందించారు.

స్కాలర్స్ విద్యార్థుల ప్రభంజనం...

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో స్కాలర్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ మార్కులకు సాధించి ప్రభంజనం సృష్టించారు. బైపీసీ ప్రథమ సంవత్సరంలో నందిని 434, అరుణ 433, సుమయ్య నూర్ 432 ,మౌనిక 432 మార్కులు సాధించగా ఎంపీసీలో ప్రశాంతి 465, లావణ్య 464, కీర్తి 464 మార్కులు పొందారు. అలాగే ఎంఈసిలో శశి 478, సీఈసీలో వర్షా 463 మార్కుల తో సత్తా చాటారు. ఇక ద్వితీయ సంవత్సరం బైపిసి లో అంజలి 985, ప్రణతి షిండే 983 మార్కులు సాధించగా ఎంపీసీలో ఇందు 985, గాయత్రి 982, ఎంఈసిలో శ్వేత 972, సిఇసిలో అక్షయ 954 మార్కులతో ప్రతిభ కనబరిచారు. చక్కటి ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఆధ్యాత్మిక బృందం అభినందించారు.

సత్తా చాటిన రావుస్ కళాశాల విద్యార్థులు...

వనపర్తి రావుస్ కళాశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం బైపిసి లో అనూష 975, ఎంపీసీ విభాగంలో సౌజన్య 967, సీఈసీ లో భవ్యశ్రీ 975, ఎంఈసిలో రామ్ చరణ్ గౌడ్ 953 మార్కులు సాధించి సత్తా చాటారు. ఇక ప్రథమ సంవత్సరం ఎంపీసీలో యాస్మిన్ తబస్సుమ్ 462, బైపీసీలో గాయత్రి 462, అఖిల 490 మార్కులు పొందారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్య సభ్యులు అధ్యాపక బృందం అభినందించారు.



Next Story

Most Viewed