హైదరాబాద్ కలెక్టర్‌కు Union Minister Kishan Reddy ఫోన్

by Disha Web Desk 2 |
హైదరాబాద్ కలెక్టర్‌కు Union Minister Kishan Reddy ఫోన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో డెక్కన్‌ నైట్‌వేర్‌ స్టోర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. దట్టంగా అలుముకున్న పొగతో స్థానిక ప్రజల ఇబ్బందులు పడ్డారని.. వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్తీవాసుల యోగక్షేమాలను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సికింద్రాబాద్ ప్రాంతంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆదాయం కోసం అక్రమంగా నిర్మించిన భవనాలు రెగ్యులరైజ్ చేయడం మానుకోవాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

జీహెచ్‌ఎంసీకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కారణం అక్రమ నిర్మాణాలని ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రమాదాలు అక్రమ నిర్మాణాల్లోనే జరిగాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాల కారణంగా గతంలో చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు. జనావాసాల మధ్య ఈ రకమైన గోడౌన్లు, వేర్‌హౌస్‌లు ఉన్నాయన్నారు. వీటన్నింటిపై సర్వేలు చేయాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని పట్టణాల్లో ఇటువంటి గోడౌన్లలో తనిఖీలు చేయాలని కోరారు. అగ్ని ప్రమాదం కారణంగా ఈ భవనం పక్కనే ఉన్న ఇళ్లు కూడా దగ్దమయ్యాయన్నారు. జనావాసాల మధ్య ప్రమాదం జరగడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. జనావాసాల మధ్య ఉన్న గోడౌన్లు, స్టోర్స్ వెంటనే ఖాళీ చేయించి సిటీకి దూరంగా ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అక్రమంగా నిర్మించిన గోడౌన్లు, స్టోర్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Also Read...

BRS ఖమ్మం సభపై MP Uttam Kumar Reddy అనూహ్య వ్యాఖ్యలు

బ్రేకింగ్ :Secundarabad ఫైర్ యాక్సిడెంట్.. ముగ్గురి సజీవ దహనం


Next Story

Most Viewed