88 సీట్లతో తెలంగాణలో పవర్‌లోకి వస్తాం: కేంద్రమంత్రి బండి సంజయ్

by Satheesh |
88 సీట్లతో తెలంగాణలో పవర్‌లోకి వస్తాం: కేంద్రమంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బండి సంజయ్ ఏపీకి వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం బండి ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలతో చర్చించారు. అనంతరం బండి మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 88 ఎమ్మెల్యే సీట్లు సాధించి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. రామ మందిరంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కాగా, గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా తలపడి బీజేపీ 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది.Next Story

Most Viewed