మెగాస్టార్ చిరంజీవి తో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ!

by Ramesh Goud |
మెగాస్టార్ చిరంజీవి తో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవితో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మర్యాధపూర్వకంగా భేటీ అయ్యారు. చిరంజీవిని కలిసేందుకు బండి సంజయ్ ఆయన నివాసానికి వెళ్లారు. బండి సంజయ్ ను సాదరంగా ఆహ్వానించిన చిరంజీవి.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తర్వాత బండి సంజయ్ ను చిరంజీవి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చం అందజేసి మీరు ఎంతో కష్టపడ్డారని, కష్టానికి తగిన పదవి లభించిందని చిరంజీవి కొనియాడారు. అనంతరం ఇరువురు అరగంట పాటు చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ మర్యాధపూర్వకంగా జరిగిందని, చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. అంతేగాక విద్యార్ధి దశ నుంచి చిరంజీవికి వీరాభిమానిని అని బండి సంజయ్ అన్నారు.
Next Story

Most Viewed