గ్రూప్ 2,3 పోస్టులు పెంచాల్సిందే.. లేదంటే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి! నిరుద్యోగుల హెచ్చరిక

by Disha Web Desk 14 |
గ్రూప్ 2,3 పోస్టులు పెంచాల్సిందే.. లేదంటే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి! నిరుద్యోగుల హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్3 పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఈ నోటిఫికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత కొత్త ప్రభుత్వం తాజాగా పరీక్ష తేదీలను వెల్లడించింది. అయితే పరీక్షలపై మరోసారి నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం గ్రూప్ 2 పోస్టులు 783, గ్రూప్ 3 1388 పోస్టులతో కలిపి నోటిఫికేషన్ ఇచ్చింది.

ఓ నిరుద్యోగి ఓ వీడియో విడుదల చేశారు. కొత్త ఉద్యోగాలతో గ్రూప్ 2, 3 నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. నిరుద్యోగులతో చెలగాటం ఆడితే ఎంపీ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులందరం సంబరాలు చేసుకుని ర్యాలీ తీసినమని, ఇప్పుడు మమ్మల్ని దగా చేసి ముంచుతున్నరని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నిరుద్యోగుల ప్రభుత్వమని నాడు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అశోక్ నగర్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు పక్కనే ఉన్న రేవంత్ రెడ్డిని అశోక్ నగర్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు’ అని నిలదీశారు. నిరుద్యోగులను దగా చేసి గ్రూప్ 4 రద్దు చేస్తామని చేయలేదన్నారు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచకుండా అలాగే పెడతామంటే ఖబడ్దార్ కాంగ్రెస్ నాయకుల్లారా ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే మీ‌కు పడుతుందని హెచ్చరించారు.


Next Story