ఒకే పేరుతో రెండు పార్టీల అభ్యర్థులు.. కీలకమైన సెగ్మెంట్ లో ఇంట్రెస్టింగ్ గా మారిన రాజకీయం

by Disha Web Desk 13 |
ఒకే పేరుతో రెండు పార్టీల అభ్యర్థులు.. కీలకమైన సెగ్మెంట్ లో  ఇంట్రెస్టింగ్ గా మారిన రాజకీయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎంపీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోవడంతో ఏ స్థానం నుంచి ఎంత మంది నామినేషన్ దాఖలు చేశారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాశం అవుతున్నది. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులో ఒకే పేరుతో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ బీజేపీ తరపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో నిలువగా ఆల్ ఇండియా బ్లాక్ పార్టీ నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అనే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. చాలా చోట్ల పేరు కలిస్తే ఇంటి పేరు మరోలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అభ్యర్థుల పూర్తి పేరు ఒకేలా ఉండటంతో ఏం జరగబోతున్నది అనేది ఆసక్తిని రేపుతున్నది. అయితే ఈ నెల 29 వరకు నామినేషన్ల విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండటంతో ఆల్ ఇండియా బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి విత్ డ్రా అవుతారా లేక పోటీలోనే ఉంటారా? ఈ ఇద్దరిలో తగ్గేదెవరు బరిలో నిలిచేదెవరు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ సెగ్మెంట్ ను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.







Next Story

Most Viewed