కేటీఆర్ ట్వీట్‌తో లొల్లి షురూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ట్విట్టర్ వార్!

by Disha Web Desk 5 |
కేటీఆర్ ట్వీట్‌తో లొల్లి షురూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ట్విట్టర్ వార్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అంటూ.. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి యువతను నమ్మించి మోసం చేసిందని, కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడే బయటపడుతోందని, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కేసులు వేసి, అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణం అయ్యారని ప్రస్తావించారు.

దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందిస్తూ.. తెలంగాణ యువత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? పదేళ్లు ఏం ఒరగబెట్టారని ప్రశ్నిస్తూ, తాను వేసినవి తప్పుడు కేసులు అయితే న్యాయస్థానం ఎందుకు రద్దు చేస్తుందని, ఎమ్మెల్యే గా ఉండి ఏం మాట్లాడుతున్నావో జర చూసుకో అన్నారు. అలాగే పేపర్ లీకేజీ గురించి నోరు మెదిపితే ఎక్కడ నీ బాగోతం బయట పడుతుందోనని తెలివిగా లీకేజీ ప్రస్తావన తీయట్లేదని విమర్శించారు. అంతేగాక ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మీ ఇంటి నిండా ఉద్యోగాలే తీసుకున్నారని, అయినా నీకు మీ నాన్నకు తెలంగాణ యువత గురించి మాట్లాడే హక్కు లేనే లేదని, ఎండల వల్ల ఆగం అయితున్నవ్, నువ్వు ఏసీ ఫుల్ పెట్టుకొని బజ్జో కేటీఆర్ అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ స్పందిస్తూ.. సోదరా, నువ్వు చదువుకున్నోనివా చదువుకొన్నోనివా? ఇంటికో ఉద్యోగం సాధ్యమైతదా? పోస్టుల గురించి ప్రశ్నిస్తే తప్పేంటని, 3000 వేల ఓట్లు వచ్చిన నీవు కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడేటోనివా? అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని, ప్రశ్నలుంటాయి, ప్రశ్నిస్తామని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా బల్మూరి వెంకట్ అన్నా నేనైతే చదువుకున్న.. మీ పెద్ద సార్ కేసీఆర్ నీ అడుగు మరీ ఇంటికో ఉద్యోగం ఎట్లా అన్నాడో! అని కేసీఆర్ మాట్లాడిన వీడియో పోస్టు చేశారు. అలాగే హుజురాబాద్ లో ఓటుకు ఆరు వేలు పంచిన దగ్గర, రూపాయి పంచకుండా తెచ్చుకున్న ఓట్లు అవి, ప్రతీది డబ్బుతో కొలమానం కట్టే మీకెలా తెలుస్తుంది అన్నారు. అంతేగాక మనలో మన మాట అన్న.. కంటోన్మెంట్ టిక్కెట్ ఎలాగూ ఇవ్వలేదు. ఒకవేళ టికెట్ ఇద్దామనుకున్నా ఇంకో ఎలక్షన్ వరకు బీఆర్ఎస్ ఉంటదానే? మరీ ఇంకా వాళ్లను జోకుడు ఎందుకు అన్నా?? అని ట్వీట్ చేశాడు. మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story

Most Viewed