పేపర్ల లీక్ కేసులో కీలక పరిణామం.. TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం!

by Disha Web Desk 19 |
పేపర్ల లీక్ కేసులో కీలక పరిణామం.. TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం!
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డిని సోమవారం సిట్ అధికారులు ఆయన ఆఫీస్‌లోనే ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. బోర్డు మార్గదర్శకాల ప్రకారం పరీక్షల ప్రశ్నపత్రాలకు చైర్మనే కస్టోడియన్‌గా ఉండాలి. ప్రశ్నపత్రాలను భద్రపరిచే కంప్యూటర్ చైర్మన్ ఆధీనంలో ఉండాలి. దీనికి సంబంధించిన పాస్ వర్డ్, ఐపీ అడ్రస్ కూడా చైర్మన్‌కు మాత్రమే తెలిసి ఉండాలి.

ఇటువంటి పరిస్థితుల్లో బోర్డు ఉద్యోగిని శంకర్ లక్ష్మికి కస్టోడియన్ భాధ్యతలు ఎందుకు అప్పగించాల్సి వచ్చింది..? పాస్ వర్డ్, ఐపీ అడ్రస్ శంకర్ లక్ష్మికి ఎందుకు ఇచ్చారు? అన్న అంశాలపై సిట్ అధికారులు వివరాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రశ్నపత్రాలను స్టోర్ చేసిన కంప్యూటర్ ఇతరులు యాక్సిస్ చెయ్యకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్నదానిపై కూడా జనార్ధన్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలియవచ్చింది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల వ్యవహార శైలిపై ఎప్పుడూ అనుమానాలు రాలేదా? అని కూడా అడిగినట్టు సమాచారం.

Next Story

Most Viewed