టీఎస్ టు టీజీ.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders Opposing to Revanth Reddy For Lunch
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్పు, రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులతో పాటు 'జయజయహే తెలంగాణ..' గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ మార్పుల వెనుక ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నవారు కొందరైతే మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన సీఎం.. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించడం వెనుక కారణాన్ని వెల్లడించారు. ఒక జాతి అస్థిత్వానికి చిరుమామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వేమ. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతం ప్రకటించామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ రేవంత్ రెడ్డి స్పందించారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా ఉండబోతున్నాయని రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఉండబోతున్నదన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలే ఇక వాహన రిజిస్ట్రేషన్లలో ఉండబోతున్నాయన్నారు. ఈ మార్పులు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ఆ ఆకాంక్షను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు.



Next Story

Most Viewed