ప్రాజెక్టులు, కాలువలపై చెట్లు పెంచాలి: సీఎస్ ​శాంతికుమారి

by Disha Web Desk 12 |
ప్రాజెక్టులు, కాలువలపై చెట్లు పెంచాలి: సీఎస్ ​శాంతికుమారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువల వెంట ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటాలని సీఎస్​శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్లాంటేషన్​జరిగిన వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. హరితహారం ఏర్పాట్లపై ఆమె మంగళవారం బీఆర్ కే భవన్ లో ప్రభుత్వ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు నీటి పారుదల శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. రానున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా నీటి పారుదల శాఖ భూముల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంపు కోసం కార్యాచరణ రూపొందించాలన్నారు.

పచ్చదనం పెంపుతో పాటు, సమీప గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్, ఫల సహాయం అందేలా సంపద వనాలను సృష్టించాలన్నారు. సాగునీరు, పంచాయతీ రాజ్, అటవీ శాఖల సమన్వయంతో స్థల పరిశీలన, స్థానికంగా అనుకూలతలు కలిగిన చెట్ల జాతులను గుర్తించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పీసీసీఎఫ్, హెచ్ ఓ ఓ ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ ఎం. హన్మంత రావు, స్పెషల్ కమిషనర్ వీ.ఎస్.ఎన్.వీ ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed