బోల్తా పడిన ట్రావెల్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 4 |
బోల్తా పడిన ట్రావెల్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, ఉండవల్లి : జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లు వల్ల ఓ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం జోగులంబా గద్వాల జిల్లా ఉండవల్లి మండలం 44వ జాతీయ రహదారిపై ఉండవల్లి కి వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై ఇటీవలే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఓ ట్రావెల్ బస్సు బెంగుళూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో బారికేడ్లు ఉండడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారి పెట్రోల్ సిబ్బంది వచ్చి పోలీసులు వచ్చి ట్రాఫిక్ పరిస్థితిని అదుపు చేశారు.

- పోలీసుల అత్యుత్సాహమే ప్రమాదానికి కారణమా..?

ఉండవల్లి మండల పోలీసులు అత్యుత్సాహంతో ఇటీవలే జాతీయ రహదారిపై ఉండవల్లి వెళ్లే మార్గం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పలువురు అసలు జాతీయ రహదారిపై బారికేడ్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు, ఉంచడంపై ఫైర్ అవుతున్నారు. ప్రయాణీకులకు ఇబ్బందిగా మారిన బారికేడ్లను తొలగించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed