తెలంగాణలో మరో ఏడుగురు అదనపు ఎస్పీల బదిలీ

by Disha Web Desk 2 |
తెలంగాణలో మరో ఏడుగురు అదనపు ఎస్పీల బదిలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీసు కమిషనర్లు, అదనపు సీపీలు, జాయింట్ సీపీలతో పాటు వివిధ స్థాయిల్లోని ఐపీఎస్ అధికారులను గత నెలలో బదిలీ చేసిన రాష్ట్ర హోంశాఖ ఇటీవలే మరికొందరిని మార్చేసింది. జిల్లాల ఎస్పీలుగా ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు పలువురు నాన్-కేడర్ ఎస్పీలను, అదనపు ఎస్పీలు, అదనపు డీసీపీలు, డీఎస్పీలను మార్చిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు అదనపు ఎస్పీలను, 61 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవీడీఎం విభాగంలో అదనపు ఎస్పీ, దక్షిణ డిస్కంలోని అదనపు ఎస్పీ సహా ఒకేసారి వేర్వేరు ఉత్తర్వులతో బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీచేశారు. పోలీసు శాఖలో గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల మేరకు పోస్టింగులు దక్కాయన్న విమర్శల నేపథ్యంలో ఆ శాఖలో సంపూర్ణ ప్రక్షాళన దిశగా నిర్ణయాలు చోటుచేసుకుంటున్నాయి.

డీజీపీ రవిగుప్త తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లోని బదిలీలు ఇలా ఉన్నాయి :

జీహెచ్ఎంసీలో ఈవీడీఎం అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి సైబరాబాద్ ఎస్‌ఓటీ అదనపు డీసీపీగాను, అక్కడున్న నాన్ కేడర్ అదనపు ఎస్పీ నారాయణ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అదనపు డీసీపీగాను బదిలీ అయ్యారు. గద్వాల అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్.రవి వరంగల్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా, విజిలెన్స్ విభాగం అదనపు ఎస్పీ మహమ్మద్ ఫజుల్ రహమాన్‌ మేడ్చల్ స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీగా, హైదరాబాద్ నార్త్ జోన్ అదనపు డీసీపీ మధుసూదనరావు జీఏడీలోని విజిలెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. రాచకొండ అదనపు డీసీపీ (క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు బదిలీ చేయాలని డీజీపీ భావించినా చివరి నిమిషంలో బదిలీని రద్దు చేశారు. సీఐడీ అదనపు ఎస్పీ కే.శ్రీనివాసరావును హైదరాబాద్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ అదనపు డీసీపీగా బదిలీ చేశారు.



Next Story

Most Viewed